మెగాస్టార్ చిరంజీవి 151వ చిత్రం సైరా నరసింహారెడ్డి భారీ బడ్జెట్ తో తెరకెక్కుతోంది. సురేందర్ రెడ్డి ఈ చిత్రానికి దర్శకుడు. మెగా పవర్ స్టార్ రాంచరణ్ ఈ చిత్రానికి నిర్మాత. దాదాపు 200 కోట్లతో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అక్టోబర్ లో విడుదల కు సన్నాహకాలు జరుగుతున్నాయి. ప్రస్తుతం సైరా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ఈ చిత్రంలో భారీ తారాగణం నటిస్తున్న సంగతి తెలిసిందే. బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్, తమిళ నటుడు విజయ్ సేతుపతి, కిచ్చా సుదీప్, తమన్నా కీలక పాత్రలో నటిస్తున్నారు. నయనతార హీరోయిన్ గా నటిస్తోంది. 

తమన్నా ఈ చిత్రంలో యువరాణిగా నటిస్తోంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో తమన్నా సైరా విశేషాలని తెలియజేసింది. ఈ చిత్రం కోసం తాను అత్యంత ఖరీదైన కాస్ట్యూమ్స్ ధరించినట్లు తెలిపింది. ఈ సైరా చిత్రంలో కాస్ట్లీ లెహెంగా ధరించాను. ఇప్పటివరకు నేను ధరించిన ఖరీదైన దుస్తులు ఇవే. వీటిని చిరంజీవి కుమార్తె సుస్మిత, ప్రముఖ డిజైనర్ అంజు మోడీ కలసి డిజైన్ చేసినట్లు తమన్నా తెలిపింది. 

బాహుబలి తర్వాత తాను నటిస్తున్న భారీ బడ్జెట్ చిత్రం ఇదేనని తమన్నా పేర్కొంది. సైరా చిత్రం అందరిని సర్ ప్రైజ్ చేసే విధంగా ఉంటుంది అని తమన్నా పేర్కొంది. ఇక బాలీవుడ్ లో కూడా మరిన్ని సినిమాల్లో నటించాలని ఉన్నట్లు తమన్నా పేర్కొంది. డాన్స్ నేపథ్యంలో ఉన్న చిత్రంలో నటించే అవకాశం వస్తే సంతోషిస్తా అని తమన్నా పేర్కొంది. శ్రీదేవి బయోపిక్ లో నటించాలని ఉన్న కోరికని కూడా బయట పెట్టింది.