తమన్నా కెరీర్ ఏమీ అంత గొప్పగా ఏమీ లేదు. హీరోయిన్ గా ఆమెకు హిట్ వచ్చి చాలా కాలం అయ్యింది. దాంతో డెస్పరేట్ హిట్ కోసం ట్రై చేస్తోంది. సైరా వంటి చిత్రంలో చేసినా అంతమంది పెద్ద స్టార్స్ మధ్యలో తన గురించి పట్టించుకుని,మాట్లాడేవాళ్లు ఉండరని ఆమెకు స్పష్టంగా తెలుసు. దాంతో తిరిగి తను ఫామ్ లోకి రావటానికి సరైన ఫ్లాట్ ఫామ్ కోసం వెతుకుతోంది. ఆ టైమ్ లో ఆమెకు సంపత్ నంది కనిపించారు. ఇప్పుడు ఇద్దరు కలిసి హిట్ కోసం కష్టపడుతున్నారు.

త్వరలో  కబడ్డీ కోచ్ గా కనిపించబోంది తమన్నా. ఇందుకోసం ఖాళీ దొరికినప్పుడల్లా ప్రాక్టీస్ చేస్తోంది.  రెగ్యులర్ క్రీడా చిత్రాలకు భిన్నంగా పూర్తి మాస్ టచ్ తో ఈ సినిమాని తెరకెక్కించబోతున్నారు. ఓ ప్రక్కన కబడ్డీ ఆడుతూనే ఆమె ప్రత్యర్థులను ఆటాడిస్తారు. అయితే ఈ సినిమాలో హీరోగా చేసే గోపీచంద్ పాత్ర మాత్రం ప్రస్తుతానికి సస్పెన్స్‌.

ఇక సినిమాలో కబడ్డీ ప్లేయర్స్‌కు కోచింగ్‌ ఇవ్వడానికి ముందు తాను కబడ్డీ గురించి తెలుసుకోవటం మంచిదని భావించింది తమన్నా.  షూటింగ్‌ త్వరలో ఆరంభం కాబోయే ఈ చిత్రం కోసం ఆమె చాలా కష్టపడుతోంది.  కబడ్డీ ట్రైనింగ్ కు వెళ్లటానికి డిసైడ్ అవ్వటమే కాక, ఫిజికల్ గా ఫిట్ గా ఉండాలని  కసరత్తులు చేస్తోంది. ఈ సినిమాకి శ్రీనివాసా చిట్టూరి నిర్మాత. ఈ చిత్రానికి ‘సీటీ మార్‌’ అనే టైటిల్‌ని అనుకుంటున్నారని సమాచారం.

తమన్నా గతంలో సంపత్ నంది దర్శకత్వం వహించిన ‘బెంగాల్ టైగర్’, రచ్చ సినిమాల్లో హీరోయిన్ గా నటించింది. సంపత్ నంది-తమన్న కాంబోలో ఇది మూడో చిత్రం. అటు గోపీచంద్ తో మాత్రం తమన్నాకు ఇదే ఫస్ట్ మూవీ. ఆమధ్య వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన ‘గౌతమ్ నంద’ ఆశించిన విజయం సాధించలేదు.