తమన్నా..తెలుగు స్టార్ హీరోయిన్స్ లో ఒకరు. ఒక వైపు గ్లామర్‌ పాత్రల్లో కనిపిస్తూనే మరో వైపు ‘బాహుబలి’, ‘సైరా’ లాంటి ప్రతిష్టాత్మక చిత్రాలలో నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలు చేస్తూ దూసుకుపోతోంది.  ఈ సంవత్సరం ప్రారంభంలోనే ‘ఎఫ్ 2’తో మంచి విజయం లభించింది. అలాగే  చారిత్రాత్మక చిత్రం ఆయన ‘సైరా’లో లక్ష్మి పాత్ర నటిగా ఆమెకు మంచి పేరు, ప్రశంసలు తీసుకువచ్చింది. ఆ తర్వాత చేసిన ‘యాక్షన్’ మూవీ ఆడకపోయినా అందులో యాక్షన్ సీక్వెన్స్ లు పేరు వచ్చింది. ఇక ఆమెను మీడియావారు, అభిమానులు మిల్కీ బ్యూటీ అని పిలుస్తూంటారు. తనను అలా పిలవటం మాత్రం ఇష్టం లేదంటోంది. 

తమన్నా మాట్లాడుతూ.. "ఫ్యాన్స్ ప్రేమతోనే అలా పిలుస్తున్నారు. అది నాకు తెలుసు. కానీ, ఆ పేరు నాకు నచ్చదు. మేని ఛాయను బట్టి ఇలా పేర్లు పెట్టడం తప్పనే చెప్పాలి. మన దేశంలో చాలామందిలో ఇలా వైట్ కలర్ స్కిన్ పట్ల అదో రకమైన ఆకర్షణ, వ్యామోహం వున్నాయి. ఇది మంచిది కాదు. అందుకే, మేని ఛాయను బట్టి కాకుండా, మన ప్రతిభను బట్టి టైటిల్స్ ఇస్తే బాగుంటుంది" అని చెప్పింది తమ్మూ. 

ప్రస్తుతం తమన్నా ఓ వైపు సినిమాలు మరోవైపు ‘నవంబర్ స్టోరీ’ అనే వెబ్ సిరీస్‌ చేస్తోంది. ఇప్పటికే ఈ వెబ్ సిరీస్‌కు సంబంధించిన షూటింగ్ కంప్లీటైంది. త్వరలో డిస్నీ హాట్ స్టార్‌లో ప్రసారం కానుంది. రామ సుబ్రహ్మణ్యం దర్శకత్వం వహించనున్న ఈ వెబ్‌సిరీస్‌ను ముందుగా తమిళంలో ప్రసారం కానుంది. ఆ తర్వాత వివిధ భాషల్లో కూడా ప్రసారం చేయనున్నారు. తమన్నా ఓ వైపు సినిమాలు, వెబ్ సిరీస్‌తో పాటు ప్రముఖ టాలీవుడ్ నిర్మాత అల్లు అరవింద్ నేతృత్వంలోని 'ఆహా' ఓటీటీ ప్లాట్ ఫాంలో.. ఓ టాక్ షోకి హోస్ట్ గా వ్యవహరిస్తోంది.