ఈ మధ్య కాలంలో డిజిటల్ మీడియాకి క్రేజ్ బాగా పెరిగింది. అందులోనూ ఈ లాక్ డౌన్ లో థియేటర్లు లేకపోవడంతో ఓటీటీలదే హవా అన్నట్టుగా సాగుతోంది.  దీంతో అనేక ఓటీటీ కంపెనీలు కోట్లకు కోట్లు ఇన్వెస్ట్ చేస్తూ సినిమాలతో పాటు వెబ్ సీరీస్ పై కూడా దృష్టి పెడుతున్నాయి.

ఈ క్రమంలో  మంచి రెమ్యునేషను ఆఫర్ చేస్తూ స్టార్స్ ను, ఫిలిం మేకర్స్  అటువైపు ఆకర్షిస్తున్నారు. మంచి రెమ్యునేషన్  వస్తుండడంతో టాప్ హీరోయిన్లు సైతం వీటి పట్ల ఆసక్తి చూపుతూ అటువైపు అడుగేస్తున్నారు. ఇప్పటికే తెలుగు నుంచి కాజల్, సమంత వెబ్ సీరీస్ లో నటిస్తున్నారు.

ఈ నేపథ్యంలో తాజాగా మిల్కీ బ్యూటీ తమన్నా కూడా ఓ తెలుగు వెబ్ సీరీస్ లో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని సమాచారం. ఆమధ్య 'గరుడ వేగ' వంటి హిట్ చిత్రాన్ని రూపొందించిన ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో ఈ వెబ్ సీరీస్ రూపొందనుంది. థ్రిల్లర్ జోనర్ లో ఈ వెబ్ సీరీస్ 8 భాగాలుగా రూపొందుతుందని తెలుస్తోంది. త్వరలోనే ఈ సీరీస్ షూటింగ్ మొదలవుతుంది.

 తమన్నా కీలకపాత్రలో రూపొందే ఈ సీరిస్ పేరు 'ఆ కాళరాత్రి'. నిజానికి ఇది రీమేక్. కన్నడంలో రెండేళ్ల క్రితం
వచ్చిన సినిమా ఇది.  ఈ సస్సెన్స్ థ్రిల్లర్ కు అక్కడ మంచి రివ్యూలు, అవార్డులు లభించాయి. ఇప్పుడు ఈ సినిమాను
వెబ్ సీరీస్ గా  రూపొందించే వర్క్ స్టార్ట్ చేస్తున్నట్లు తెలుస్తోంది. 

  ఆహా ఓటిటి మాత్రం ఈ ప్రాజెక్టును ఫైనల్ చేసింది. వాళ్లే  ఫండింగ్ చేస్తారని తెలుస్తోంది.  లిమిటెడ్ క్యారక్టర్స్ తో, ఓ పల్లెటూరు నేపథ్యంలో నడిచే కథ కనుక లిమిటెడ్  బడ్జెట్ లోనే లాగించేయచ్చు.