'విక్కీ డోనార్' చిత్రంతో ఆయుష్మాన్ ఖురానాకి హీరోగా మంచి గుర్తింపు లభించింది. ఈ సినిమా సక్సెస్ తో కెరీర్ పరంగా వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. వరుస సక్సెస్ లతో క్రేజీ హీరోగా మారిపోయాడు. గతేదాడిలో 'అంధాదూన్', 'బడాయి హో' చిత్రాలతో ఘన విజయాలు అందుకున్నాడు.

ఇది ఇలా ఉండగా.. ఆయుష్మాన్ భార్య గత కొద్దిరోజులుగా వార్తల్లో నిలుస్తోంది. ఇటీవల తన భార్యక్యాన్సర్ తో బాధ పడుతుందని ఆయుష్మాన్ వెల్లడించిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ విషయం గురించి ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చిందిఆయుష్మాన్ ఖురానా భార్య తాహిరా. తాజాగా ఆమె సోషల్ మీడియాలో ఓ టాప్ లెస్ బ్యాక్ ఫోటోని షేర్ చేసింది.

తాను క్యాన్సర్ చికిత్స చేయించుకున్న సమయంలో సర్జరీకి సంబంధించిన కత్తి గాట్లని చూపించేందుకు ఈ ఫోటో షేర్ చేశానని తెలిపింది. ఆయుష్మాన్ ఖురానా హీరోగా ఎంట్రీ ఇవ్వకముందే తాహిరాతో వివాహం జరిగింది. అతడు 'విక్కీ డోనార్' సినిమాలో నటిస్తోన్న సమయంలో తాహిరా గర్భవతి. అదే సమయంలో ఆమెకి బ్రెస్ట్ కాన్సర్ ఉందని తెలిసింది.

ఆ సమయంలో తన భర్త, ఆమె మానసికంగా ఎంతో వేదనని అనుభవించినట్లు చెప్పుకొచ్చింది. ఇంత పెద్ద సమస్యని ఎదుర్కొనే పరిణితి కూడా ఇద్దరికీ లేదని తాహిరా తెలిపింది. ఆ సమయంలో ఆయుష్మాన్ ఖురానా ఎంతో భయపడ్డాడని, కనీసం తనకు ధైర్యం చెప్పే పరిస్థితిలో కూడా లేడని వెల్లడించింది. 

తన జీవితంలోనే అవి దారుణమైన రోజులని తెలిపింది. ఇన్ని కష్టాలు ఎదుర్కొని కాన్సర్ ని జయించినట్లు స్పష్టం చేసింది.