వన్నె తరగని అందం టబు సొంతం. ఐదు పదుల వయసు దాటినా మతిపోగోట్టే ఫిట్ నెస్ తో టబు ఆకట్టుకుంటోంది. బాలీవుడ్ తో పాటు టబు తెలుగు, తమిళ భాషల్లో కూడా ఎన్నో హిట్ చిత్రాల్లో నటించింది.

వన్నె తరగని అందం టబు సొంతం. ఐదు పదుల వయసు దాటినా మతిపోగోట్టే ఫిట్ నెస్ తో టబు ఆకట్టుకుంటోంది. బాలీవుడ్ తో పాటు టబు తెలుగు, తమిళ భాషల్లో కూడా ఎన్నో హిట్ చిత్రాల్లో నటించింది. వెంకటేష్, నాగార్జున, చిరంజీవి, బాలకృష్ణ లాంటి టాప్ హీరోల సరసన టబు నటించింది. కూలి నెంబర్ 1, నిన్నే పెళ్లాడతా లాంటి హిట్ చిత్రాల్లో ఆమె భాగమైంది. 

ప్రస్తుతం Tabu సెకండ్ ఇన్నింగ్స్ లో క్యారెక్టర్ రోల్స్ నటిస్తోంది. టబు చివరగా తెలుగులో Allu Arjun 'అల వైకుంఠపురములో' చిత్రంలో కీలక పాత్రలో నటించింది. బన్నీకి తల్లి పాత్రలో ఆమె నటించిన సంగతి తెలిసిందే. అల వైకుంఠపురములో చిత్రం నాన్ బాహుబలి రికార్డులు సృష్టించింది. బన్నీ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. 

ఈ చిత్రాన్ని హిందీలో యంగ్ సెన్సేషన్ కార్తీక్ ఆర్యన్ హీరోగా రీమేక్ చేస్తున్నారు. రోహిత్ దర్శకత్వంలో హిందీ రీమేక్ తెరకెక్కుతోంది. షూటింగ్ లొకేషన్ లో రోహిత్ తో దిగిన సెల్ఫీని కార్తీక్ ఆర్యన్ సోషల్ మీడియాలో పంచుకున్నాడు. ఈ ఫోటోపై టబు స్పందించింది. 

View post on Instagram

'అది నా చిత్రం. జాగ్రత్తగా రీమేక్ చేయండి' అని స్వీట్ వార్నింగ్ ఇస్తూ కామెంట్ పెట్టింది. దీనితో టబుకి కార్తీక్ ఆర్యన్ రిప్లై ఇచ్చారు. మీ సినిమా కాబట్టే ఇంకా ప్రేమతో చేస్తున్నాం మేడం అని బదులిచ్చాడు. ఈ చిత్రానికి 'షెహ్ జాదా' అనే టైటిల్ ఫిక్స్ చేశారు. ఈ చిత్రంలో కార్తీక్ ఆర్యన్ కి జోడిగా కృతి సనన్ నటిస్తోంది. వచ్చే ఏడాది ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. 

Also Read: Deepthi Sunaina: ముద్దుముద్దుగా దీప్తి సునైనా.. మైండ్ బ్లోయింగ్ ఫోజులకు కుర్రాళ్లు ఫిదా