సొట్ట బుగ్గల సుందరి తాప్సి 2010లో తెలుగులో ఝుమ్మంది నాదం చిత్రంతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. కొంతకాలం తెలుగులో వరుసగా చిత్రాలు చేసిన తాప్సి ఆ తర్వాత బాలీవుడ్ బాట పట్టింది.
సొట్ట బుగ్గల సుందరి తాప్సి 2010లో తెలుగులో ఝుమ్మంది నాదం చిత్రంతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. కొంతకాలం తెలుగులో వరుసగా చిత్రాలు చేసిన తాప్సి ఆ తర్వాత బాలీవుడ్ బాట పట్టింది. బాలీవుడ్ లో తాప్సి ప్రస్తుతం ఉమెన్ సెంట్రిక్, కథ బలం ఉన్న చిత్రాల్లో ఎక్కువగా నటిస్తోంది.
ఇదిలా ఉండగా తాప్సి బాలీవుడ్ కి వెళ్ళాక ఎలాంటి విషయం గురించి అయినా మొహమాటం లేకుండా మాట్లాడడం నేర్చుకుంది. పలు ఇంటర్వ్యూలలో తాప్సి బోల్డ్ గా మాట్లాడడం చూస్తూనే ఉన్నాం. తాజాగా ఓ ఇంటర్వ్యూలో తాప్సి తన పర్సనల్ లైఫ్ గురించి హాట్ కామెంట్స్ చేసింది.
బాయ్ ఫ్రెండ్స్, లవ్ అఫైర్స్, మ్యారేజ్, డేటింగ్ ఇలాంటి పర్సనల్ విషయాలని సెలెబ్రిటీలు వీలైనంత ఎక్కువగా గోప్యంగా ఉంచుతారు. కానీ తాప్సి మాత్రం తన లైఫ్ లో జరిగిన ఓ చేదు అనుభవాన్ని మొహమాటం లేకుండా చెప్పేసింది.
బాయ్ ఫ్రెండ్స్ తో డేటింగ్ అనుభవం గురించి ఓ ఇంటర్వ్యూలో తాప్సికి ప్రశ్న ఎదురైంది. దీనికి తాప్సి బదులిస్తూ.. నేను చాలా మంది బాయ్ ఫ్రెండ్స్ తో డేటింగ్ కి వెళ్ళాను. వారిలో ఎందుకూ పనికిరాని బాయ్ ఫ్రెండ్స్ కూడా ఉన్నారు అంటూ తాప్సి హాట్ కామెంట్స్ చేసింది. తాప్సి చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తాప్సిని అంతలా నిరాశపరిచిన ఆ బాయ్ ఫ్రెండ్స్ ఎవరో మరి. ప్రస్తుతం తాప్సి మాథ్యూస్ అనే వ్యక్తితో రిలేషన్ షిప్ కొనసాగిస్తోంది. తమ ప్రేమకు కుటుంబ సభ్యులు కూడా అంగీకారం తెలిపినట్లు తాప్సి పేర్కొంది. ప్రస్తుతం తాప్సి హిందీ, తమిళంలో దాదాపు అరడజను చిత్రాల్లో నటిస్తోంది.
