నువ్వొక చెత్త నటివి, నీ సినిమాలు చూడలేకపోతున్నాం: తాప్సికి చేదు అనుభవం

Taapsee Pannu shuts down troll who calls her worst looking actress
Highlights

బాలీవుడ్ లో అందరికంటే చెత్త నటిలా అనిపిస్తుంది.. ఇంకోసారి నేను ఆమెను చూడాలని అనుకోవడం లేదు. రెండు, మూడు చిత్రాల కంటే ఆమె ఇక్కడ ఎక్కువ కాలం కొనసాగలేదు. త్వరలోనే ఈము బాలీవుడ్ నుండి వెళ్లిపోతుంది

టాలీవుడ్ లో హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకొని ఇక్కడ నుండి బాలీవుడ్ కు వెళ్లింది నటి తాప్సి. బాలీవుడ్ కు వెళ్లిన తరువాత ఆమె టాలీవుడ్ ను చిన్నచూపు చూడడం మొదలుపెట్టింది. పలు ఈవెంట్లలో తెలుగులో హీరోయిన్లను గ్లామర్ కోసమే పెట్టుకుంటారని సంచలన కామెంట్స్ పెట్టింది. తను ఎంతో ప్రేమించి చేస్తోన్న హిందీ సినిమాల్లో ఆమెను చూడలేకపోతున్నామని కొందరు నెటిజన్లు చేసిన కామెంట్లు ఇప్పుడు వార్తల్లో నిలిచాయి.

శుక్రవారం ట్విట్టర్ లో తాప్సిని ఉద్దేశించి ఓ నెటిజన్.. 'బాలీవుడ్ లో అందరికంటే చెత్త నటిలా అనిపిస్తుంది.. ఇంకోసారి నేను ఆమెను చూడాలని అనుకోవడం లేదు. రెండు, మూడు చిత్రాల కంటే ఆమె ఇక్కడ ఎక్కువ కాలం కొనసాగలేదు. త్వరలోనే ఈము బాలీవుడ్ నుండి వెళ్లిపోతుంది' అంటూ ట్వీట్ చేశాడు. తనను విమర్శించిన నెటిజన్ కు సమాధానంగా తాప్సి..

'నేను నటించిన మూడు సినిమాలు ఇప్పటికే విడుదలయ్యాయి. మరో మూడు చిత్రాల షూటింగ్ లు పూర్తయ్యాయి. అవి కాకుండా రీసెంట్ గా రెండు సినిమాలకు సైన్ చేశాను. కాబట్టి మీరు కొంచెం భరించాల్సి ఉంటుంది' అంటూ చెప్పుకొచ్చింది. మరొక నెటిజన్ 'మీ సినిమాలు చూడడానికి అంతగా బాగోవని' కామెంట్ చేయగా.. సినిమాలు చూడడంలో మీ అభిరుచి మార్చుకోండి అంటూ రిప్లై చేసింది. ప్రస్తుతం తెలుగులో ఆమె నటించిన 'నీవెవరో' సినిమా విడుదలకు సిద్ధమవుతోంది.   

 

loader