Asianet News TeluguAsianet News Telugu

తాప్సితో నటించేందుకు నో చెబుతున్న హీరోలు.. ఆమెని భరించడం కష్టం..

సౌత్ లో పలు చిత్రాల్లో రాణించిన తాప్సి ఆ తర్వాత బాలీవుడ్ బాట పట్టింది. వైవిధ్యమైన పాత్రల్లో నటించి అద్భుతమైన గుర్తింపు సొంతం చేసుకుంది. లేడి ఓరియెంటెడ్ చిత్రాలతో దూసుకుపోతోంది.

Taapsee Pannu says Some actors refuse roles in her films
Author
Hyderabad, First Published Nov 5, 2021, 5:33 PM IST

సౌత్ లో పలు చిత్రాల్లో రాణించిన తాప్సి ఆ తర్వాత బాలీవుడ్ బాట పట్టింది. వైవిధ్యమైన పాత్రల్లో నటించి అద్భుతమైన గుర్తింపు సొంతం చేసుకుంది. లేడి ఓరియెంటెడ్ చిత్రాలతో దూసుకుపోతోంది. రీసెంట్ గా తాప్సి రష్మీ రాకెట్ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. గ్లోబల్ యంగ్ లీడర్స్ సమ్మిట్ 2021లో తాప్సి పాల్గొంది. 

అక్కడ జరిగిన చర్చ కార్యక్రమాల్లో తాప్సి తన కెరీర్ గురించి మాట్లాడుతూ బాలీవుడ్ స్టార్ హీరోలపై సంచలన వ్యాఖ్యలు చేసింది. తాప్సి ఉన్నది ఉన్నట్లు మాట్లాడే మనస్తత్వం. పలు విషయాలపై బోల్డ్ గా మాట్లాడే తాప్సి తరచుగా వివాదాల్లో చిక్కుకుంటూ ఉంటుంది. ఈ క్రమంలో ఆమెతో నటించేందుకు కొందరు హీరోలు ఆసక్తి చూపడం లేదు. 

ఈ విషయం గురించి తాప్సి మాట్లాడుతూ.. కొందరు హీరోలు నాతో నటించేందుకు వెనకాడుతున్నారు. స్టార్ హీరోలతో పాటు కొత్త హీరోలు కూడా తనతో నటించేందుకు ఆసక్తిగా లేరు అని తాప్సి తెలిపింది. 

Also Read: పునీత్ సమాధి వద్ద కన్నీరు మున్నీరైన సూర్య.. మేమిద్దరం గర్భంలో ఉన్నప్పుడే..

పేరు ప్రస్తావించకుండా తనతో నటించేందుకు నో చెప్పిన కొందరు నటుల కామెంట్స్ ని తెలిపింది. ఓ చిత్రంలో నేను ద్విపాత్రాభినయం చేస్తున్నాని తెలుసుకుని.. ఒక తాప్సిని భరించడమే కష్టం.. అలాంటిది ఇద్దరితోనా అని కామెంట్స్ చేశాడు. మరో నటుడు.. ఈ సినిమాలో నేను నటించను.. ఎందుకంటే సానుభూతి మొత్తం ఆమెకే వెళుతుంది అని చెప్పినట్లు తాప్సి పేర్కొంది. 

అలాంటి నటులు కొంచెం ఆత్మవిశ్వాసం పెంచుకోవాలని కోరుకుంటున్నట్లు తాప్సి పేర్కొంది. హిందీలో పింక్, జుడ్వా 2, తప్పడ్ లాంటి చిత్రాలు తాప్సి క్రేజ్ ని పెంచాయి. ప్రస్తుతం తాప్సి పలు చిత్రాల్లో నటిస్తోంది. 

Also read: దీపావళికి అనసూయ మరో ట్రీట్.. ఈసారి ప్యూర్ క్లాసీ లుక్ తో అదరగొట్టేసింది

తెలుగులో ఝుమ్మంది నాదం చిత్రంతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన తాప్సి ఆ తర్వాత మిస్టర్ పర్ఫెక్ట్, దరువు, సాహసం లాంటి చిత్రాల్లో నటించింది. ఝుమ్మంది నాదం చిత్రంలో రాఘవేంద్ర రావు తన బొడ్డుని ఎక్కువగా చూపించడంపై కూడా తాప్సి అప్పట్లో హాట్ కామెంట్స్ చేసింది. రాఘవేంద్ర రావుపై ఆమె చేసిన వ్యాఖ్యలు వివాదం అయ్యాయి కూడా. 

Follow Us:
Download App:
  • android
  • ios