దర్శకుడు ఓంకార్ రాజుగారి గది 3 సినిమాను ఇటీవల పూజా కార్యక్రమాలతో మొదలుపెట్టిన సంగతి తెలిసిందే. సినిమా షూటింగ్ స్పీడ్ పెంచాలని అనుకుంటున్న సమయంలో ఊహించని విధంగా తమన్నా తప్పుకున్నట్లు వార్తలు వచ్చాయి. స్క్రిప్ట్ విషయంలో ఓంకార్ చెప్పకుండా మార్పులు చేయడమే అందుకు కారణమని టాక్ వచ్చింది.  

ఈ విషయంపై చిత్ర యూనిట్ ఇంకా ఎలాంటి వివరణ ఇవ్వలేదు. అయితే ఇప్పుడు ఓంకార్ దృష్టి తాప్సి వైపు మళ్లినట్లు తెలుస్తోంది. బాలీవుడ్ లో వరుస అవకాశాలతో దూసుకుపోతున్న తాప్సి గత కొంత కాలంగా తెలుగు సినిమాలను బాగా తగ్గించేసింది. రెమ్యునరేషన్ కూడా అపెంచినట్లు రూమర్స్ వినిపిస్తున్నాయి. 

అయితే కథ నచ్చితే సొట్టబుగ్గల సుందరి రెమ్యునరేషన్ లో డిస్కౌంట్ ఇచ్చే అవకాశం ఉందని తెలుసుకున్న ఓంకార్ ఆమెనే ఫిక్స్ చేయాలనీ అనుకుంటున్నాడట. లేడి ఓరియెంటెడ్ కథలకు ఈ మధ్య గ్రీన్ సిగ్నల్ ఇస్తున్న తాప్సి రాజుగారి గది 3 సినిమాకు కూడా ఒకే చెప్పే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.