బాలీవుడ్ వెళ్లిన తరువాత ఇటువైపే చూడని తాప్సి చాలా కాలం తరువాత గేమ్ ఓవర్ అనే సినిమాతో హడావుడి చేస్తోంది. హారర్ కథాంశంతో తెరకెక్కిన ఈ సినిమా ట్రైలర్ ను నేడు రానా చేతుల మీదుగా రిలీజ్ చేశారు. డిఫరెంట్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమా టీజర్ కొన్ని రోజుల క్రితం రిలీజ్ అయ్యింది. 

ఇక ఇప్పుడు విడుదలైన ట్రైలర్ ఇంట్రెస్టింగ్ గా ఉంది. ఒక మనిషికి రెండు జీవితాలుక్ అనే థాట్ తో సినిమా స్క్రీన్ ప్లే ఉంటుంది. తాప్సిని భయపెడుతున్న ఆ భయం ఏమిటి అనే అంశమే సినిమాలో అసలైన కీ పాయింట్. సెకండ్ హాఫ్ లో సినిమా ఎంతో ఉత్కంఠభరితంగా ఉంటుందని సమాచారం. జూన్ 14న గేమ్ ఓవర్ సినిమా సౌత్ లో గ్రాండ్ గా రిలీజ్ కానుంది.