పటేల్ S.I.R సినిమాలో అవినీతి ఆఫీసర్ గా ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న బెంగళూరు ముద్దుగుమ్మ ఇప్పుడు సౌత్ ఇండియాలో ఆఫర్ల వర్షం కురుస్తోంది. 

పటేల్ S.I.R సినిమాతో ఓ ప్రత్యేక క్రేజ్ ని సంపాదించిన తాన్యా హోప్ కు తమిళ కన్నడ సినిమాల్లో ఆఫర్ల వర్షం కురుస్తోంది. అప్పట్లో ఒకడుండేవాడు సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన తాన్యా, రెండు సినిమాలతోనే ఉపేంద్ర సరసన ఛాన్స్ కొట్టేసింది. తెలుగు, కన్నడ భాషల్లో నిర్మితమౌతున్న హోమ్ మినిస్టర్ సినమాలో లీడ్ రోల్ ని తాన్యా సొంతం చేసుకుంది.

ప్రస్తుతానికి హోమ్ మినిస్టర్ సినిమాతో పాటు, తమిళంలో హీరో అరుణ్ విజయ్ తో 'తడం' అనే సినిమా చేస్తోంది తాన్యా. కన్నడలో అవార్డ్ విన్నింగ్ డైరెక్టర్ సునిల్ కుమార్ దేసాయి నిర్మిస్తున్న మరో సినిమాకి కూడా సెలెక్టయింది తాన్యా హోప్.⁠⁠⁠⁠