కళాబంధు టి సుబ్బిరామిరెడ్డి సినీ ప్రముఖుల ప్రతి ఏటా తన పుట్టినరోజున అవార్డుని అందిస్తూ వస్తున్నారు. వైభవంగా కార్యక్రమం నిర్వహించి అవార్డుల ప్రధానం చేస్తున్నారు. సెప్టెంబర్ 17న ఆయన పుట్టినరోజు. ఈ సందర్భంగా మీడియా సమావేశం నిర్వహించి ఆ రోజుల జరగబోయే కార్యక్రమం గురించి వివరించారు. 

ఈ సారి తన పుట్టినరోజున సహజ నటి జయసుధకు 'అభినయ మయూరి' అనే అవార్డు ప్రధానం చేయబోతున్నట్లు సుబ్బిరామిరెడ్డి ప్రకటించారు. ఆమె 46 ఏళ్లుగా తెలుగు చలన చిత్ర పరిశ్రమకు సేవలు అందిస్తున్నారని సుబ్బిరామిరెడ్డి కొనియాడారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్, ఏఎన్నార్ లతో ప్రజెంట్ జనరేషన్ హీరోలని పోల్చుతూ సుబ్బిరామిరెడ్డి విమర్శలు చేశారు. 

దేవుడు సృష్టించిన కళలలో సినిమా చాలా గొప్పది. ఈ విషయం చాలా మందికి తెలియక సినిమా వాళ్లని చులకనగా చూస్తుంటారు. అది సరైంది కాదని సుబ్బిరామిరెడ్డి అన్నారు. అదేవిధంగా గతంలో ఏ కార్యక్రమం జరిగినా, ఏ అవార్డు వచ్చినా ఎన్టీఆర్, ఏఎన్నార్ లాంటి హీరోలు హాజరై తీసుకుని వెళ్లేవారు. కానీ ప్రజెంట్ జనరేషన్ హీరోలు సినిమా కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారని అన్నారు. 17న జరగబోయే ఈవెంట్ కు సినీ రాజకీయ ప్రముఖులు హాజరు కాబోతున్నట్లు సుబ్బిరామిరెడ్డి తెలిపారు.