మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న చిత్రం సైరా. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత ఆధారంగా రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్ చివరి దశలో ఉంది. అసలైతే సినిమా ఈ పాటికే రావాలి. కానీ షూటింగ్ ఆలస్యం అవ్వడంతో రిలీజ్ డేట్ ను గత కొన్ని నెలలుగా మారుస్తున్నారు. 

అయితే వచ్చే సంక్రాంతికి సినిమా రానుందని మొన్నటివరకు రూమర్స్ బాగానే వచ్చాయి. అయితే చరణ్ ఇప్పుడు ఆగస్ట్ కి సినిమాను రిలీజ్ చెయ్యడానికి ప్లాన్ చేస్తున్నాడు. కానీ అదే సమయంలో ప్రభాస్ సాహో సినిమా కూడా డేట్ ను ఫిక్స్ చేసుకుంది. యువీ క్రియేషన్స్ సైరా కంటే ముందే రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేసుకుంది గనక ఇప్పుడు సాహో వచ్చిన అనంతరం సైరా సినిమాను రిలీజ్ చేసుకోవాలని చర్చలు జరుపుతున్నారు. 

రెండు కూడా పెద్ద సినిమాలే కాబట్టి నిర్మాతలు స్పెషల్ గా మీటింగ్ లు జరిపి రిలీజ్ డేట్స్ విషయంలో చర్చలు కొనసాగిస్తున్నారు. నిర్మాత రామ్ చరణ్ ఇంకా తన వివరణను ఇవ్వలేదని తెలుస్తోంది. ఇక యువి క్రియేషన్స్ సాహోను ఆగష్టు 15కె రిలీజ్ చెయ్యాలని డిసైడ్ అయ్యింది. అల్లు అరవింద్ ఆలోచన ప్రకారం మెగాస్టార్ సినిమా వెనక్కి తగ్గితేనే బెటర్ అని వచ్చే సంక్రాంతికి సినిమాను రిలీజ్ చేసుకుంటే మంచిదని సలహాలు ఇస్తున్నట్లు సమాచారం.