ఎప్పుడెప్పుడా అని తెలుగు సినీ లోకం ఎదురుచూస్తున్న సైరా చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చేంసింది. గాంధీ జయంతి సందర్భంగా నేడు సైరా చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా విడుదలవుతోంది. యూఎస్ లో కొద్దిసేపటి క్రితమే ప్రీమియర్ షోలు ప్రారంభమయ్యాయి. 

చిత్ర విశేషాలని పంచుకుంటూ అభిమానులు సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్నారు. ఇదిలా ఉండగా సైరా చిత్రంలో యాక్షన్ ఎపిసోడ్స్ కళ్ళు చెదిరేలా ఉన్నాయని ప్రేక్షకుల నుంచి స్పందన వస్తోంది. ప్రస్తుతం యుఎస్ లో ప్రీమియర్ షోల నుంచి వస్తున్న సమాచారం ప్రకారం మెగాస్టార్ చిరంజీవి నరసింహారెడ్డి పాత్రలో కోయిల కుంట్ల కోటపై దాడి చేసే సన్నివేశం అద్భుతంగా ఉన్నట్లు తెలుస్తోంది. 

మాస్ ప్రేక్షకులకు ఈ సీన్ కనుల విందే అని అంటున్నారు. చిరు సూపర్బ్ ఎనర్జీతో అదరగొట్టినట్లు తెలుస్తోంది. ఫస్ట్ హాఫ్ లో జలస్థంబన విద్యతో మెగాస్టార్ ఎంట్రీ, పాలెగార్లతో చిరంజీవి జరిపే చర్చలు ఎంగేజింగ్ గా ఉన్నాయి. ఎమోషనల్ సీన్స్ కూడా అద్భుతంగా ఉన్నాయి. కథ కొంత స్లోగా సాగినట్లు అనిపించినప్పటికీ ఇంటర్వెల్ సన్నివేశంతో సినిమా గ్రాఫ్ పెరిగింది.