దసరా సెలవులను టార్గెట్ చేస్తూ టాలీవుడ్ సినిమాలు రిలీజ్ కు సిద్ధమయ్యాయి. అయితే భారీ స్థాయిలో రిలీజ్ అవుతున్న సైరా తో పోటీగా యాక్షన్ హీరో గోపీచంద్ కూడా కొద్దీ దూరంలో తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నాడు. ముందుగా సైరా నరసింహారెడ్డి అక్టోబర్ 2న వరల్డ్ వైడ్ గా అత్యధిక లొకేషన్స్ లో రిలీజ్ కాబోతోంది. 

మెగాస్టార్ కెరీర్ లోనే సైరా అత్యధిక థియేటర్స్ లో తెలుగుతో పాటు హిందీ తమిళ్ మలయాళం కన్నడ భాషల్లో విడుదల కానుంది. అయితే గోపీచంద్ అక్టోబర్ 5న తన చాణక్య సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. రెండు సినిమాలు డిఫరెంట్ జానర్స్ లో తెరకెక్కినవి. ఏ మాత్రం పాజిటివ్ టాక్ వచ్చిన రెండు సినిమాలకు మంచి కలెక్షన్స్ అందుతాయి. కానీ గోపీచంద్ కి బాక్స్ ఆఫీస్ వద్ద ప్రమాదం పొంచి ఉందనే చెప్పాలి. 

మెగాస్టార్ బిగ్ బడ్జెట్ మూవీపై తెలుగులో అంచనాలు భారీగా నెలకొన్నాయి. దీంతో సైరా సినిమా మొదటిరోజు పాజిటివ్ టాక్ అందుకుంటే వారం ఎండ్ అయ్యేసరికి కలెక్షన్స్ డోస్ తగ్గదు. అందుకే చాణక్య సినిమా కూడా మినిమమ్ పాజిటివ్ టాక్ తెచ్చుకోవాల్సిందే. లేకుంటే నష్టాలు  తప్పవు. మరి ఫైనల్ గా గోపి దసరా బరిలో ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.