మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరెక్కుతున్న ఉయ్యాలవాడ నరసింహ రెడ్డి బయోపిక్ ఎప్పుడు వస్తుందో అని అభిమానులు వేయి కళ్ళతో ఎదురుచూస్తున్నారు. అలాంటి అభిమానుల కోసం చిత్ర యూనిట్ అప్పుడపుడు కొన్ని స్పెషల్ ఫోటోలను సోషల్ మీడియా నుంచి వదులుతోంది. 

ఇక నటీనటులు కూడా వారి ఇష్టపూర్వకంగా వదులుతున్న పిక్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. బాలీవుడ్ సీనియర్ నటుడు అమితాబ్ బచ్చన్ సినిమాలో గోసాయి వెంకన్న పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇక అవుకు రాజుగా నటించిన సుదీప్ వెంకన్న పాత్రలో ఉన్న అమితాబ్ ని ప్రత్యేకంగా కలిశారు. 

అందుకు సంబందించిన పిక్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. సినిమాలో వీరి పాత్రలు కూడా ఎవరు ఊహించని విధంగా అంచనాలకు మించి అబ్బురపరచడం కాయమని తెలుస్తోంది. సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ సినిమాను కొణిదెల ప్రొడక్షన్ లో రామ్ చరణ్ నిర్మిస్తోన్న సంగతి తెలిసిందే. 2019 సమ్మర్ అనంతరం సినిమాను రిలీజ్ చేయడానికి చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోంది.