మెగాస్టార్ చిరంజీవి నటించిన ప్రతిష్టాత్మక చిత్రం 'సైరా నరసింహారెడ్డి'. సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని రామ్ చరణ్ నిర్మించాడు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటున్న ఈ చిత్రం అక్టోబర్ 2న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాలో కొన్ని హైలైట్ సీన్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం!

*ఝాన్సీ లక్ష్మీభాయి పాత్రలో హీరోయిన్ అనుష్క నటిస్తోంది. ఆమె నోటి వెంటే 'సై రా నరసింహారెడ్డి' కథ చెప్పడం ప్రారంభవుతుందట.

*సినిమాలో టైటిల్ సాంగ్ ఐదు నిమిషాలకు పైగా ఉంటుంది. సిరివెన్నెల రాసిన ఈ పాట సినిమాకి హైలైట్ గా నిలుస్తుందని చెబుతున్నారు. 

*సినిమాలో మరో కీలకమైన ఎపిసోడ్ ఉంటుందట. అదే అండర్ వాటర్ ఫైట్. తమన్నా, చిరంజీవి, ఫైటర్ల మధ్య ఉండే ఈ ఫైట్ కోసం విదేశీ టెక్నీషియన్లు పని చేశారు. ఈ ఒక్క ఫైట్ కోసం భారీగా ఖర్చు చేసినట్లు తెలుస్తోంది. 

*సినిమాకి క్లైమాక్స్ మరో హైలైట్ అని చెబుతున్నారు. ఎమోషనల్ గా డైలాగ్స్ తో సాగే ఈ సన్నివేశాలు మనసుని హత్తుకునేలా ఉంటాయట. ఈ సన్నివేశాల్లో మెగాస్టార్ చెప్పే డైలాగ్స్ అభిమానులు బాగా కనెక్ట్ అవుతాయని టాక్. 

*సినిమాలో ప్రతీ సీన్ భారీ రేంజ్ లో ఉంటుందని.. సెట్ ప్రాపర్టీస్ కోసం బాగా ఖర్చు చేశారని తెలుస్తోంది. 
 
స్వాతంత్రసమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత కథతో తెరకెక్కిన ఈ చిత్రంలో చిరు సరసన నయనతార నటించింది. అమితాబ్ బచ్చన్, జగపతి బాబు, విజయ్ సేతుపతి, రవి కిషన్, సుదీప్, తమన్నా, నిహారిక తదితరులు కీలక పాత్రలలో నటించారు. అమిత్ త్రివేది సంగీతం అందించారు.