Asianet News TeluguAsianet News Telugu

సైరాకు సాహో నేర్పిన పాఠం: విదేశీ మార్కెట్లను కొల్లగొడుతున్న మెగాస్టార్

సైరా చిత్రం క్రియేట్ చేసిన ఈ బజ్ వల్ల భారీ స్థాయిలోనే ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ముఖ్యంగా ఓవర్సీస్ మార్కెట్లో సైరా ప్రీ రిలేస్ బిజినెస్ అదిరిపోయింది. అందుతున్న సమాచారం మేరకు ఇప్పటికే 2లక్షల 62వేల డాలర్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ప్రీమియర్ షోల కలెక్షన్లలో సాహూను చాలా తేలికగా దాటేస్తుంది. 

 

syeraa doesn't repeat sahho's mistake
Author
Hyderabad, First Published Sep 28, 2019, 1:14 PM IST

250 కోట్లతో నిర్మించిన భారీ బడ్జెట్ చిత్రం సైరా నరసింహా రెడ్డి. అక్టోబర్ 2న ప్రేక్షకులముందుకు రానుంది. దక్షిణాది అన్ని భాషలతో సహా హిందీలో కూడా ఈ చిత్రాన్ని నిర్మించారు. నిన్న ఈ చిత్ర ట్రైలర్ విడుదలయ్యింది. విడుదలైన 45 నిముషాల్లోనే లక్ష లైకులను కూడా సాధించింది. ఖైదీ 150 విడుదలైన చాలా గ్యాప్ తరువాత చిరంజీవి నట విశ్వరూపం చూపెట్టేసాడని ఫ్యాన్స్ తెగ సంబరపడిపోతున్నారు. ఈ చిత్ర ట్రైలర్ ను థియేటర్లలో విడుదల చేయడం ద్వారా భారీ బజ్ ని క్రియేట్ చేయడంలో సైరా చిత్ర యూనిట్ సక్సెస్ అయ్యిందని చెప్పవచ్చు.   

సైరా చిత్రం క్రియేట్ చేసిన ఈ బజ్ వల్ల భారీ స్థాయిలోనే ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ముఖ్యంగా ఓవర్సీస్ మార్కెట్లో సైరా ప్రీ రిలేస్ బిజినెస్ అదిరిపోయింది. అందుతున్న సమాచారం మేరకు ఇప్పటికే 2లక్షల 62వేల డాలర్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ప్రీమియర్ షోల కలెక్షన్లలో సాహూను చాలా తేలికగా దాటేస్తుంది. 

ఇక్కడే సాహూ చిత్ర యూనిట్ చేసిన తప్పును సైరా చేయడం లేదు. విదేశీ మార్కెట్లో సాహూ సినిమాని యష్ రాజ్ ఫిలిమ్స్ రిలీజ్ చేసింది. విదేశీ మార్కెట్ల విషయంలో మాత్రం ఈ సదరు సంస్థ హిందీ వెర్షన్ కి ఎక్కువ ప్రాధాన్యతను ఇచ్చింది. సాధారణంగా తెలుగు సినిమాలు విదేశాల్లో ( తెలుగు ప్రజలు ఒకే దెగ్గర అధికంగా కాన్సన్ట్రేట్ అయ్యి ఉండరు కాబట్టి) లాంగ్ రన్ ఆడవు. ఇందుకోసమని ప్రీమియర్ షోలపైన్నే ఎక్కువగా ఆధారపడతారు ప్రొడ్యూసర్లు. దాదాపుగా 60 శాతం డబ్బులను ఈ ప్రీమియర్ షోల రూపంలోనే వెనకేసుకుంటారు. ఇందుకు విరుద్ధంగా యాష్ రాజ్ ఫిలిమ్స్ తెలుగుకన్నా హిందీ భాషలో అధిక ప్రీమియర్ షోలను వేసింది. 

అమెరికా పరిస్థితిని గనుక పరిశీలిస్తే అక్కడ ముఖ్యమైన, తెలుగువారు అధికంగా ఉండే ప్రాంతాల్లో కూడా హిందీ వెర్షన్ షోలకు చెందిన టిక్కెట్లనే ఎక్కువగా విక్రయించారు. సహజంగానే అమెరికాలో ఆఫీసులనుంచి నేరుగా థియేటర్లకు వెళుతుంటారు. ఇలాంటి ఈవెనింగ్  ప్రైమ్ టైములో తెలుగు వెర్షన్ కు కాకుండా హిందీ వెర్షన్ కు ప్రాధాన్యత ఇచ్చారు. 

 హిందీ ప్రేక్షకులు ప్రభాస్ సినిమాకు టాక్ ఎలా ఉందో తెలుసుకోకుండా థియేటర్ కు వచ్చే ఛాన్స్ తక్కువ. ప్రభాస్ ని వారు కేవలం బాహుబలిలో మాత్రమే చూసారు. ప్రభాస్ ఏమీ  బాలీవుడ్ ఖాన్ త్రయంలో ఒకడు కాదు. కాబట్టి అంత లాయల్ ఫ్యాన్ బేస్ ని ఆశించడం కష్టం. ఇలాంటి పరిస్థితుల్లో ప్రీమియర్ షోల రూపంలో ఎక్కువ కలెక్షన్లు రాబట్టే ఛాన్స్ తక్కువగా కనపడుతుంది. అజ్ఞ్యాతవాసి సినిమా ప్రీమియర్ షోల రూపంలో 1.5 మిలియన్ డాలర్లను వసూలు చేసింది. సాహో చాలా ఈజీగా ఈ మార్కును దాటుతుందని ఊహించారందరూ. కాకపోతే ప్లానింగ్ సరిగా లేకపోవడం వల్ల బొక్క బోర్లా పడింది. 

సైరా చిత్ర యూనిట్ మాత్రం ఈ తప్పు చేయట్లేదు. ఓవర్ సీస్ చిత్ర డిస్ట్రిబ్యూటర్లకు ప్రొడ్యూసర్ రామ్ చరణ్ ఈ విషయమై క్లారిటీ ఇచ్చినట్టు సమాచారం. తెలుగు వెర్షన్ కి ఎక్కువ షోలను కేటాయించాలని, హిందీ వెర్షన్ కు లిమిటెడ్ స్క్రీన్స్ మాత్రమే కేటాయించాలని తెలిపినట్టు సమాచారం. 

Follow Us:
Download App:
  • android
  • ios