మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం నటిస్తోన్న హిస్టారికల్ ఫిల్మ్ సైరా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. జార్జియాలో యుద్ధ సన్నివేశాలను భారీ బడ్జెట్ తో తెరక్కిస్తున్నారు. సైరా చిత్ర యూనిట్ సెట్ చేసుకున్న షెడ్యూల్స్ లలో ఇదే అతిపెద్ద షెడ్యూల్. వందల మంది సెట్ లో రోజు బిజీ బిజీగా గడుపుతున్నారు. దర్శకుడు సురేందర్ రెడ్డి వీలైనంత త్వరగా షూటింగ్ పూర్తి చేయాలనీ చూస్తున్నాడు. 

ఇకపోతే రీసెంట్ గా సినిమాలో అమితాబ్ బచ్చన్ పాత్ర మోషన్ పోస్టర్ ని రిలీజ్ చేశారు. సినిమాలో విజయ్ సేతుపతి - సుదీప్ కిచ్చా కూడా నటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే వారిద్దరూ షూటింగ్ స్పాట్ లో ఒక ఫొటో దిగగా అది ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. వారి పాత్రలు సినిమాలో స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలవనున్నాయి. 

ముఖ్యంగా సుదీప్ క్యారెక్టర్ ఎవరు ఊహించని విధంగా ఉంటుందని సమాచారం. ఇద్దరిని ఇలా చూస్తుంటే కొంత భయంకరంగా కనిపిస్తారని అనిపిస్తోంది. ఇక మెగాస్టార్ ఉయ్యాలవాడ నరసింహ రెడ్డి పాత్రలో కనిపించనున్న సంగతి తెలిసిందే. వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమాను రామ్ చరణ్ నిర్మిస్తున్నారు.