'సై.. రా' మరో రెండేళ్ళ తరువాతే!

sye raa narasimha reddy shooting delayed
Highlights

'బాహుబలి' సినిమా తరువాత ఆ రేంజ్ లో సినిమాలు చేయడానికి చాలా మంది దర్శకనిర్మాతలు 

'బాహుబలి' సినిమా తరువాత ఆ రేంజ్ లో సినిమాలు చేయడానికి చాలా మంది దర్శకనిర్మాతలు ఆసక్తి చూపుతున్నారు.ఈ క్రమంలో మెగాస్టార్ చిరంజీవి దర్శకుడు సురేందర్ రెడ్డితో కలిసి భారీ ప్రాజెక్ట్ కు శ్రీకారం చుట్టారు. అదే 'సై రా నరసింహారెడ్డి'. ఎంతో అట్టహాసంగా మొదలైన ఈ సినిమాను అనౌన్స్ చేసి చాలా కాలం అవుతుంది. కానీ ఇప్పటివరకు సినిమా షూటింగ్ పది శాతం కూడా పూర్తి కాలేదు.

కొన్ని నెలల క్రితం మొదలైన రెగ్యులర్ షూటింగ్ లో చిరు, నయనతార, అమితాబ్ ల లుక్ కు సంబంధించిన ఫోటోలు లీక్ అయ్యాయి. అయితే ప్రస్తుతానికి ఈ సినిమా షూటింగ్ వాయిదా పడినట్లు చెబుతున్నారు. ఇప్పటికీ దర్శకుడు సురేందర్ రెడ్డి స్క్రిప్ట్ కు మెరుగులు దిద్దుతున్నాడని, రచయితలతో కొన్ని డైలాగ్స్ రాయిస్తున్నాడని సమాచారం. నిజానికి ఈ సినిమాను 2018 ఎండింగ్ లో విడుదల చేయాలని అనుకున్నారు.

కానీ సురేందర్ గనుక ఇదే స్పీడ్ కంటిన్యూ చేస్తే.. వచ్చే ఏడాదికి కూడా ఈ సినిమా షూటింగ్ పూర్తి కాదు. ఈ లెక్కన చూసుకుంటే మరో రెండేళ్లకు కానీ 'సై రా' విడుదలయ్యే అవకాశాలు కనిపించడం లేదు. మరి ఈలోగా చిరు మరో సినిమాను పూర్తి చేస్తాడేమో చూడాలి!

loader