బిగ్ బడ్జెట్ మూవీగా నేడు సైరా నరసింహా రెడ్డి భారీగా రిలీజ్ కాబోతున్న విషయం తెలిసిందే. ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన ఈ సినిమా కలెక్షన్స్ పై ఇప్పుడు ప్రతి ఒక్కరు చర్చించుకుంటున్నారు. మొదటిరోజు వసూళ్లు ఏ స్థాయిలో ఉంటాయనేది హాట్ టాపిక్ గా మారింది. మొదటిరోజు అసలు బాహుబలి 2 వసూళ్లను అధిగమిస్తుందా లేదా అనేది ఇంట్రెస్టింగ్ పాయింట్. 

బయట కలెక్షన్స్ ల సంగతి ఎలా ఉన్నా లోకల్ గా తెలుగు రాష్ట్రాల్లో వసూళ్లు ఎంత వస్తాయి అనేది అసలైన మ్యాటర్. బాహుబలి 2 ఫస్ట్ డే 52.50కోట్ల నెట్ కలెక్షన్స్ తో బిగ్గెస్ట్ నెట్ కలెక్షన్స్ అందుకున్న సినిమాగా న్యూ రికార్డ్ క్రియేట్ చేసింది. ఇక ఇప్పుడు అదే తరహాలో సైరా కూడా ఆంద్రప్రదేశ్ - తెలంగాణ రాష్ట్రాల్లో రిలీజ్ కాబోతోంది. వరల్డ్ వైడ్ గా ఎంత వసూళ్లు చేస్తుందో చెప్పడం కష్టమే. 

బాహుబలి రేంజ్ లో 50కోట్ల నెట్ కలెక్షన్స్ దాటగలదా లేదా అనేది మొదటి టార్గెట్. బాహుబలి 2 ఆ రికార్డ్ అందుకోవడానికి బాహుబలి 1 ఎంతగానో ఉపయోగపడింది. కానీ సైరా సోలో ఎటాక్ చేసేందుకు సిద్ధమైంది. మెగాస్టార్ క్రేజ్ మాత్రమే సినిమాకు హెల్ప్ అవుతోంది. ప్రీమియర్ షోలకు పాజిటివ్ రెస్పాన్స్ రావడంతో మొదటిరోజు మంచి హైప్ క్రియేట్ అయ్యింది. సినీ ఎనలిస్ట్ ల అంచనా ప్రకారం ఫస్ట్ డే 40 కోట్ల నుంచి 45కోట్లవరకు కలెక్షన్స్ అందే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది