సైరా నరసింహారెడ్డి చిత్రం మరికొద్ది సేపట్లో అభిమానులను అలరించటానికి రంగం సిద్దమైంది. యుఎస్ లోనూ ప్రీమియర్స్ కు ఫ్యాన్స్ సిద్దపడుతున్నారు. అయితే యుఎస్ డిస్ట్రిబ్యూషన్ తీసుకున్న వాళ్లు  ప్రీమియర్స్ కు సరిగ్గా ప్లాన్ చేయలేదని తెలుస్తోంది. దాంతో అక్కడ మెగా ఫ్యాన్స్ మండిపడుతున్నట్లు సమాచారం. సరైన టైమ్ కు కంటెంట్ ని రప్పించుకోకపోవటం సమస్యగా మారిందని తెలుస్తోంది.  దాంతో ఇప్పటికి యుఎస్ లో చాలా స్క్రీన్స్ బుక్కింగ్స్ ఓపెన్ కాలేదు.

ఇది ఖచ్చితంగా రేపటి ప్రీమియర్స్ పై ఇంపాక్ట్ చూపెడుతుందంటున్నారు.  డిస్ట్రిబ్యూటర్స్, వాళ్ల టీమ్ లోకల్ మెగా ఫ్యాన్స్ తో సరైన కో ఆర్డినేషన్ లేకపోవటమే ఈ సమస్యకు మూలకారణంగా చెప్తున్నారు. యుఎస్ లో ప్రమోషన్  కూడా సరిగ్గా లేదు. ఇవన్నీ ప్రీమియర్ కలెక్షన్స్స పై ప్రభావం చూపెడతాయనటంలో సందేహం లేదు. ఇంత నిర్లక్ష్యంగా ఉండటం ఏమిటని మెగా ఫ్యాన్స్ సోషల్ మీడిాయలో మండిపడుతున్నారు.

ఇక ప్రభాస్ సాహో సినిమాను చేసిన ఫారస్ సంస్థనే సైరా విదేశీ పంపిణీ హక్కులు తీసుకుంది. ఈ మధ్యకాలంలో  ఓవర్ సీస్ మార్కెట్ పెద్ద గొప్పగా లేదు. మహర్షి లాంటి సూపర్ హిట్ సినిమాకు కూడా కష్టం అయ్యింది. సాహో సినిమా సగానికి సగం నష్టాలు మిగిల్చింది. గద్దగకొండ గణేష్ అయితే పూర్తిగా అక్కడ డ్రాప్ అయ్యింది.

ఇలాంటి టైమ్ లో సైరా కు ఉన్న క్రేజ్ తో ఓవర్ సీస్ లో  15 కోట్లు అమ్మారు .సరిగ్గా ప్రమోట్ చేసుకుంటే యుఎస్  మార్కెట్ లో మెగాస్టార్ కు వున్న క్రేజ్, సినిమాకు వున్న బజ్ అన్నీ కలిసి 10 కోట్లకు పైగా వస్తుందని లెక్కలు వేస్తున్నారు.