బాగమతి సినిమాతో బాక్స్ ఆఫీస్ లో కొత్త లెక్కలు తెచ్చుకున్న అనుష్క ఇప్పుడు స్టార్ హీరోలకు ఏ మాత్రం తక్కువ కాదు. అందుకే హై బడ్జెట్ సినిమాల్లో ఆమె క్రేజ్ ను యాడ్ చేసుకుంటున్నారు. రీసెంట్ గా మణిరత్నం తన వెయ్యి కోట్ల హిస్టారికల్ ఫిల్మ్ లో అనుష్కను ఒక కీ రోల్ కోసం సెలెక్ట్ చేసుకున్నాడు. 

ఇక సైరా సినిమాలో కూడా అనుష్క ఒక ప్రత్యేక పాటలో కనిపించనున్నట్లు తెలుస్తోంది. 13 ఏళ్ల క్రితం మెగాస్టార్ స్టాలిన్ సినిమాలో స్పెషల్ సాంగ్ లో మెరిసిన అమ్మడు ఇప్పుడు సైరా సినిమా ద్వారా మరోసారి మెగాస్టార్ తో స్టెప్పులేయనుంది. స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత ఆధారంగా సైరా సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. 

దసరా సమయంలో సినిమాను రిలీజ్ చేయాలనీ అనుకుంటున్నారు. అయితే సినిమా షూటింగ్ దాదాపు ఎండింగ్ కు వచ్చేసింది. ఇక ప్రత్యేక గీతంలో అనుష్కతో షూటింగ్ చేయనున్నారు. కొణిదెల ప్రొడక్షన్ లో రామ్ చరణ్ నిర్మిస్తోన్న ఈ సినిమాలో నయనతార మెయిన్ హీరోయిన్ గా నటిస్తోన్న సంగతి తెలిసిందే.