మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న చిత్రం సైరా. దేశంలోనే మొదటి స్వాతంత్ర సమరయోధుడు ఉయ్యాలవడ నరసింహ రెడ్డి జీవిత ఆధారంగా సినిమాను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. డైరెక్టర్ సురేందర్ రెడ్డి సీన్స్ అన్ని సంతృప్తిగా వచ్చే వరకు షూటింగ్ లో ఏ మాత్రం అలసత్వం చూపడం లేదు. ఇకపోతే సినిమాలో ఇప్పటికే ఒక భారీ యాక్షన్ ఎపిసోడ్ ని ఫినిష్ చేసిన చిత్ర యూనిట్ ఇప్పుడు మరో వార్ షెడ్యూల్ తో బిజీ కానుంది.

ముంబయిలో స్పెషల్ గా సెట్ చేసిన ఒక స్విమ్మింగ్ ఫూల్ లో వార్ సీన్స్ ను షూట్ చేయనున్నారు. గ్రాఫిక్స్ కోసం చుట్టూ గ్రీన్ మ్యాట్స్ ను కూడా సెట్ చేశారు. నిపుణుల పర్యవేక్షణలో నీటి అడుగున కొన్ని యాక్షన్ ఎపిసోడ్స్ ను తెరకెక్కించనున్నారు. మెగాస్టార్ అందుకోసం ముందుగానే వర్క్ షాప్ లో పాల్గొని కొన్ని టిప్స్ తీసుకున్నారు. ఈ ఛాలెంజ్ షెడ్యూల్ కోసం చిత్ర యూనిట్ తీవ్రంగా కష్టపడనుంది. నెక్స్ట్ వీక్ లో షెడ్యూల్ ని స్టార్  చేసేందుకు అంతా సిద్ధం చేశారు.

చిరు తనయుడు మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ కొణిదెల ప్రొడక్షన్ లో సినిమాను భారీ బడ్జెట్ తో నిర్మిస్తోన్న సంగతి తెలిసిందే. వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమాలో మెగాస్టార్ సరసన నయనతార నటిస్తోంది. బిగ్ బి అమితాబ్ బచ్చన్ జగపతి బాబు సుదీప్ కిచ్చా వంటి ప్రముఖ నటులు కూడా సినిమాలో ముఖ్య పాత్రల్లో నటిస్తోన్న సంగతి తెలిసిందే.