పెద్ద సినిమాలు రిలీజ్ అయ్యినా అందరూ థియోటర్ కు వెళ్ళి చూసే పరిస్దితి ఉండదు. పెరిగిన టిక్కెట్ రేట్లు వారిని భయపెడుతూంటాయి. దాతా చోలా మందిసినిమాని టీవీల్లో కానీ, డిజిటల్ మీడియాలో కానీ చూపించటానికి ఆసక్తి చూపిస్తున్నారు. ఈ నేపధ్యంలో ఆ రెండు చోట్లా కూడా మంచి పబ్లిసిటీ చేసి వదులుతున్నారు. మరీ ముఖ్యంగా అమెజాన్ ప్రైమ్ లో సినిమా రిలీజ్ ఎప్పుడు అని ఎదురుచూసే వాళ్ళు పెరిగిపోయారు. గత కొద్ది రోజులుగా  “సైరా నరసింహా రెడ్డి” సినిమా అమెజాన్ ప్రైమ్ స్ట్రీమింగ్ కోసం కళ్లు కాయలు కాసేలా ఎదురుచూస్తున్న వారికి శుభవార్త. స్ట్రీమింగ్ డేట్ ఇచ్చేసారు.

భారీ అంచనాల మధ్య, భారీ బడ్జెట్ తో తెరకెక్కి రిలీజైన చిత్రం టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి తాజా చిత్రం “సైరా నరసింహా రెడ్డి” ..  అక్టోబర్ 2 న గాంధీ జయంతి సందర్భంగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కొణిదెల ప్రొడక్షన్స్ పై రామ్ చరణ్ ఈ సినిమాని నిర్మించగా సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించారు. సినిమాకి బెన్ ఫిట్ షో నుండే మంచి టాక్ వచ్చింది. ఉయ్యాలవాడ పాత్రలో చిరంజీవి నటనకి ఫిదా అయ్యారు, సినిమా సెలబ్రేటీస్ కూడా సైరాని మెచ్చుకున్నారు.

ఇప్పుడు  ఈ చిత్రం థియోటర్ బిజినెస్ ముగిసింది. చిరు కెరీర్ లోనే హైయిస్ట్ గ్రాసర్ గా నిలిచిన ఈ చిత్రం బడ్జెట్,బిజినెస్ వైజ్ చూస్తే కమర్షియల్ గా నిరాశపరిచింది.  ముఖ్యంగా తెలుగు మినహా ఇతర రాష్ట్రాల్లో ఈ సినిమా వర్కవుట్ కాలేదు. అయితే చిరు ఈ వయస్సులో కూడా పడ్డ కష్టాన్ని అందరూ మెచ్చుకున్నారు. ఇక ఈ చిత్రం అమెజాన్ ప్రైమ్ లో  నవంబ‌రు 21న గురువారం అర్ధరాత్రి నుంచి స్టీమింగ్ కాబోతోంది.

ఈ మేరకు అమెజాన్ కు చెందిన “అమెజాన్ హెల్ప్” వారు అధికారికంగా డేట్ ప్రకటన చేసారు.తెలుగు,తమిళ్,మలయాళం మరియు కన్నడ భాషల్లో ఈ చిత్రం వచ్చే నవంబర్ 21 నుంచి ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ తో స్ట్రీమ్ కానుందని తేల్చి చెప్పేసారు.దాంతో సైరా స్ట్రీమింగ్ సస్పెన్స్ వీడినట్లైంది. వివిధ కార‌ణాల‌తో థియోటర్ లో మిస్ అయిన వాళ్లు ఈ సినిమా ఆన్ లైన్లో చూడబోతున్నారు.

ప్రస్తుతం చిరంజీవి కొరటాల దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. ఈ సినిమాని మ్యాట్ని ఎంటర్టైన్మెంట్ తో కొణిదెల ప్రొడక్షన్ కలిసి నిర్మిస్తోంది.