ఈ సినిమా రిలీజ్ డేట్ ముందే ఎనౌన్స్ చేయటం, మెగా క్యాంప్ కు ఎవరూ ఎదురు వెళ్లాలనుకోవటంతో తెలుగులో ఆ దరిదాపుల్లో పెద్ద సినిమాలు రిలీజ్ లు లేవు. ఏవో చిన్నా చితకా సినిమాలు హిట్ అయినా సైరా రాగానే థియోటర్స్ ఖాళీ చేయించేస్తారు. అయితే ఇది కేవలం తెలుగు రెండు రాష్ట్రాల్లోనే జరుగుతుంది. హిందీ మార్కెట్ మన చేతిలో ఉండదు. ఇప్పుడు అక్కడ నుంచే పోటీ మొదలైంది.

మెగాస్టార్ చిరంజీవి హీరోగా దర్శకుడు సురేందర్ రెడ్డి తెరకెక్కిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘సైరా నరసింహారెడ్డి’. చారిత్రాత్మక సినిమా కావడంతో అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ సినిమా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని దసరా కానుకగా అక్టోబర్ 2న విడుదల కానుంది. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళంతో పాటు హిందీలో కూడా ఈ మూవీ రిలీజ్ కాబోతోంది. హిందీ మార్కెట్ కోసం అమితాబ్ ని సీన్ లోకి తెచ్చారు. అక్కడా భారీ ఎత్తున రిలీజ్ కు ప్లాన్ చేస్తున్నారు. సల్మాన్ ఖాన్ సైతం ఈ సినిమా హిందీ రిలీజ్ కు తన వంతు సాయిం అందించబోతున్నట్లు సమాచారం. అయితే ఊహించని విధంగా హృతిక్ రోషన్ సినిమా సీన్ లోకి వచ్చింది. 

సైరా రిలీజ్   రోజున హిందీలో హృతిక్ రోషన్.. టైగర్ ష్రాఫ్ హీరోలుగా చేస్తున్న ‘వార్’ మూవీ రిలీజ్ కాబోతున్నది. యాక్షన్ ఎంటర్టైనర్‌గా రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రానికి సిద్ధార్థ్ ఆనంద్ దర్శకుడు. గతంలో హృతిక్ రోషన్ హీరోగా ఆయన తెరకెక్కించిన ‘బ్యాంగ్ బ్యాంగ్’ చిత్రం కూడా అక్టోబర్ 2న విడుదలై మంచి సక్సెస్ అందుకుంది. ఇక ఇప్పటికే  ఈ చిత్ర టీజర్ రిలీజై యూట్యూబ్‌లో రికార్డులు సృష్టిస్తోంది. 53 సెకన్ల నిడివి కలిగిన వార్ టీజర్ స్పైసీ యాక్షన్‌తో ఆకట్టుకుంటోంది.  ఖచ్చితంగా ‘వార్’ చూడటానికే బాలీవుడ్ ప్రేక్షకులు ఆసక్తి చూపిస్తారు. మరి వాళ్లను తమవైపు తిప్పుకోవటానికి ‘సైరా’ ఎలా ప్లాన్ చేస్తాడో  వేచి చూడాలి.?