'సై రా' క్లైమాక్స్ డైలాగ్ లీక్ చేసిన ప్రముఖ రైటర్!

https://static.asianetnews.com/images/authors/74ce1d03-f84b-5b8e-abc1-c43c5f7c8632.jpg
First Published 24, Aug 2018, 5:56 PM IST
sye ra narasimhareddy movie climax dialogue leaked
Highlights

చిరంజీవి ప్రధాన పాత్రలో రూపొందుతోన్న చిత్రం 'సై రా నరసింహారెడ్డి'. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత చరిత్రతో తెరకెక్కుతోన్న ఈ సినిమాకు సంబంధించిన టీజర్ ని ఇటీవల చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా విడుదల చేశారు.

చిరంజీవి ప్రధాన పాత్రలో రూపొందుతోన్న చిత్రం 'సై రా నరసింహారెడ్డి'. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత చరిత్రతో తెరకెక్కుతోన్న ఈ సినిమాకు సంబంధించిన టీజర్ ని ఇటీవల చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా విడుదల చేశారు. టీజర్ విడుదలైన కొద్ది గంటల్లోనే కొన్ని మిలియన్ వ్యూస్ ని దక్కించుకొని చిరు స్టామినా ఏంటో నిరూపించింది. అయితే ఈ సినిమాకు రైటర్లుగా వ్యవహరించారు పరుచూరి బ్రదర్స్.

దాదాపు పన్నెండేళ్లుగా వారు ఈ కథని చిరంజీవితో తెరకెక్కించాలని అనుకున్నారు. ఇటీవల 'పరుచూరి పలుకులు'లో ఈ సినిమా గురించి ముచ్చటించిన పరుచూరి గోపాలకృష్ణ అభిమానుల కోసం 'సై రా' సినిమా క్లైమాక్స్ లో వచ్చే డైలాగ్ ని చెప్పారు. ''ఈ సినిమా మోషన్ పోస్టర్ రిలీజ్ చేసిన రోజు సినిమాలోని ఒక డైలాగ్ చెప్పాను. మీరందరూ ఆ డైలాగ్ ని ఇష్టపడ్డారు. ఈ సినిమా నుండి నేను మరొక డైలాగ్ చెప్పాలని అనుకుంటున్నాను.

'సైరా' క్లైమాక్స్ లో కథానాయకుడి చేతులిరిచి కట్టేస్తారు. ముఖం మీద ఉరితాడు వేలాడుతూ ఉంటుంది. ''ఏంట్రా ధైర్యం.. సావు భయం లేదా నీకు..?'' అంటూ ఓ పాత్ర అంటే, ''సచ్చి పుట్టినవాడిని.. చనిపోయిన తరువాత కూడా బతికేవాణ్ణి.. చావంటే నాకెందుకురా భయం'' అనేది కథానాయకుడి డైలాగ్. ఆగలేక మీకోసమని ఈ చిన్న డైలాగ్ లీక్ చేశాను. చిరంజీవి గారు కోప్పడతారేమో.. ఆయన మీదున్న ప్రేమతో.. మీపై గల అభిమానంతోనే ఈ డైలాగ్ లీక్ చేశాను'' అంటూ చెప్పుకొచ్చారు. 

loader