త్రివిక్రమ్ శ్రీనివాస్, అల్లు అర్జున్ కాంబినేషన్ లో సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. మూడోసారి ఈ కాంబినేషన్ రిపీట్ అవుతుండడంతో ఆడియన్స్ లో సినిమాపై అంచనాలు పెరిగిపోవడం ఖాయం. మార్చి నుండి సినిమా రెగ్యులర్ షూటింగ్ జరగనుంది. త్రివిక్రమ్, బన్నీ ఆరు నెలల్లో సినిమా షూటింగ్ పూర్తి చేసి దసరాకి సినిమాను విడుదల చేయాలనుకున్నారు.

కానీ ఇప్పుడు వారు డైలమాలో పడినట్లు తెలుస్తోంది. దీనికి కారణం మెగాస్టార్ 'సై రా నరసింహారెడ్డి' సినిమా అని తెలుస్తోంది. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతోన్న 'సై రా' ని వేసవిలో విడుదల చేయాలనుకున్నారు. కానీ ఇప్పుడు సినిమా దసరాకి వస్తుందని నిర్మాత రామ్ చరణ్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. అదే గనుక జరిగితే త్రివిక్రమ్, బన్నీ వచ్చే ఏడాది సంక్రాంతి వరకు ఎదురుచూడాలి.

పండగ సీజన్ లో సినిమా రిలీజ్ చేస్తే కలెక్షన్ల పరంగా కలిసొస్తుందని అదే సీజన్ లో సినిమాలు విడుదల చేయాలనుకుంటారు. త్రివిక్రమ్, బన్నీ కూడా అదే ప్లాన్ వేశారు. కానీ ఇప్పుడు వారి ప్లాన్ వర్కవుట్ అయ్యేలా లేదు. సై రాతో పోటీగా తమ సినిమాను రంగంలోకి దింపలేరు.

అలా అని నాన్ సీజన్ లో సినిమాను విడుదల కూడా చేయలేరు. సంక్రాంతి వరకు ఆగుదామంటే అప్పటికి కూడా కాంపిటిషన్ తప్పదు. పైగా చాలా ఆలస్యం కూడా అయితుంది. మరి ఈ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి!