బాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా - హాలీవుడ్ సింగర్ నిక్ జోనాస్ ఇరు సంప్రదాయాలను గౌరవించి వివాహబంధంతో ఒకటయ్యారు. శనివారం వెస్టర్న్ స్టైల్ లో నిక్ ప్రియాంకను మనువాడగా ఇక ఆదివారం హిందూ సంప్రదాయపద్ధతిలో ప్రియాంకా నిక్ చేత మూడు ముళ్ళు వేయించుకుంది. ప్రస్తుతం వీరికి సంబందించిన పెళ్లి ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. 

ఇకపోతే ప్రస్తుతం వీరి వెడ్డింగ్ కు సంబందించిన ఒక న్యూస్ బాలీవుడ్ మీడియాలో వైరల్ గా మారింది. ప్రియాంక చోప్రా కజిన్ పరిణితి చోప్రా కొత్త పెళ్లి కొడుకుని 3 కోట్ల వరకు డిమాండ్ చేసిందట. జోధ్ పూర్ ప్యాలెస్ లో అట్టహాసంగా జరిగిన పెళ్లి వేడుకలో కుటుంబ సభ్యులు ఈ సీన్ చూసి షాకయ్యారట. అయితే అది మరి అంత సీరియస్ మ్యాటర్ కాదులెండి. 

హిందూ వెడ్డింగ్ లలో వరుడిని ఆటపట్టిస్తూ పెళ్లి కూతురి బంధువులు  డబ్బులను డిమాండ్ చేయడం కామన్. అయితే ప్రియాంక కుటుంబంలోని యువతి యువకులు నిక్ జోనాస్ చెప్పులను దాచేసి చేసి తెగ ఆటపట్టించారట. 5 లక్షల డాలర్స్ ను(రూ.3కోట్లు) ఇచ్చి తీరాల్సిందే అని పరిణితి  అడిగేసిందట. దీంతో ఆ విషయం తెలియక షాకైన నిక్ ప్రియాంకను అడిగి తెలుసుకొని కొంత మొత్తంలో ముట్టజెప్పినట్లు టాక్ వస్తోంది. మరి ఇది ఎంతవరకు నిజమో తెలియాలంటే ఇంటర్వ్యూలకు వచ్చినప్పుడు ప్రియాంకను అడిగితే బెటర్ అని బాలీవుడ్ మీడియా చెబుతోంది.