సోషల్ మీడియా హవా పెరిగిపోయిన తరువాత సెలబ్రిటీలపై ట్రోలింగ్ కూడా బాగా పెరిగింది. సినిమాలో మన తారలు కనిపించే సన్నివేశాలేమైనా కాస్త తేడాగా ఉన్నా.. వాటిపై మీమ్స్ చేసి ట్రోల్స్ చేసేవరకు వదిలిపెట్టడం లేదు. తాజాగా బాలీవుడ్ బ్యూటీ స్వర భాస్కర్ కు ట్రోలర్స్ నుండి షాక్ తగిలింది.

గతంలో స్వర నటించిన 'వీర్ దే వెడ్డింగ్' సినిమాలో ఓ అడల్ట్ సీన్ లో ఆమె కనిపించింది. స్వయంతృప్తి పొందుతూ స్వర కనిపించడంతో ఆ సమయంలో ఆమెను బాగా ట్రోల్ చేశారు. ఆ ట్రోలింగ్స్ కి అప్పట్లో ఆమె ఘాటు బదులిచ్చింది. తాజాగా మరోసారి స్వరాని టార్గెట్ చేశారు. ప్రస్తుతం ఎలెక్షన్ సీజన్ కావడంతో ఓటు వేయాలని ప్రచారాలు చేస్తున్నారు.

ఈ క్రమంలో కొందరు వ్యక్తులు వినూత్నంగా ప్రచారం చేయాలని భావించి ''ఈ ఎన్నికల్లో స్వర భాస్కర్ లాగా ఉండొద్దు. మీ వేలిని తెలివిగా ఉపయోగించండి'' అంటూ ప్లకార్డులు పట్టుకొని అడల్ట్ ఓటర్లకు అవగాహన కల్పించారు. 

ఇది చూసిన స్వర భాస్కర్.. ''ట్రోలర్లు మళ్లీ ఇలా ఎండలో నిలబడి నన్ను పాపులర్ చేయడానికి కష్టపడుతున్నారు. మీరు చాలా స్వీట్.. చాలా డెడికేషన్ ఉంది. నన్ను కించపరచడాన్ని నేనేం పట్టించుకోవడం లేదు. మీ తెలివి అంతే అనుకుంటాను. కానీ మీ కష్టానికి జోహారులు'' అంటూ కౌంటర్ ఇచ్చింది.