బాలీవుడ్ ప్రముఖ నటి స్వర భాస్కర్ మరోసారి తన ట్వీట్ తో సోషల్ మీడియాని షేక్ చేసింది. దీంతో నెటిజన్స్ ఆమెపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. పాకిస్థాన్ పోతావా పంపిస్తామని అలాగే బర్నల్ రాసుకోండి మేడమ్ అంటూ మరికొందరు చేసిన కామెంట్స్ నార్త్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాయి. 

ఇటీవల  బీహార్ లో స్వర భాస్కర్  బీజేపీకి వ్యతిరేఖంగా కాంగ్రెస్ తరపున ప్రచారాలు నిర్వహించారు. బీహార్ లో కన్నయ్య కుమార్, అతీషి మర్లేనాలకు మద్దతు పలికిన ఆమె రిజల్ట్ అనంతరం మోడీ గెలుపుపై ఎవరు ఊహించని విధంగా ట్వీట్ చేశారు.  ముందుగా అద్భుత విజయాన్ని అందుకున్న మోడీకి శుభాకాంక్షలు అంటూ.. ఓటర్లు ఇచ్చిన తీర్పును గౌరవిస్తామని అన్నారు. 

అయితే మోడీ భవిష్యత్తులో ఇచ్చిన హామీలను ఆచరణలో పెడతారని భావిస్తున్నట్లు చెప్పిన స్వర భాస్కర్ అయన దేశానికి ప్రధాని అలాగే ఓటేయని వారికీ కూడా ప్రధాని అని వివరణ ఇచ్చారు. దీంతో నెటిజన్స్ ఆమె చేసిన ట్వీట్ లో ఆగ్రహం ఉన్నట్లు అర్థమవుతోందని బర్నల్ రాసుకో అని కౌంటర్ ఇస్తున్నారు. అలాగే పాకిస్తాన్ పంపుతామంటూ మరికొంత మంది ట్వీట్ చేయడంతో స్వర భాస్కర్ కి సంబందించిన ఈ న్యూస్ మీడియాలో వైరల్ గా మారింది.