పుల్వామా ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత వైమానిక దళం.. పాకిస్తాన్ లోని ఉగ్ర శిబిరాలపై మెరుపు దాడులు జరిపింది. అయితే ఆ రాత్రంతా ప్రధాని నరేంద్ర మోడీ నిద్రపోలేదని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.

అయితే దీనిపై బాలీవుడ్ నటి స్వరా భాస్కర్ ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ.. '' మోడీ రాత్రంతా నిద్రపోకుండా ఉన్నారా.. అందులో గొప్పేముంది. అది ఆయన ఉద్యోగంలో భాగం'' అంటూ ట్వీట్ చేసింది.

ఇటువంటి సమయంలో స్వరాభాస్కర్ ఈ రకమైన కామెంట్ చేయడంతో నెటిజన్లు ఆమెను తప్పుబడుతున్నారు. ఆమెను దూషిస్తూ కామెంట్లు పెడుతున్నారు. 'మీరు 18 గంటలు పని చేస్తారా..? లేదు కదా ఎందుకంటే మీకు అసలు పనే దొరకడం లేదు కాబట్టి. మీరు అర్బన్ నక్సలైట్ లా తయారయ్యారు' అంటూ విమర్శించారు.

ఆమె పెట్టిన ట్వీట్ ని తొలగించాలని నెటిజన్లు డిమాండ్ చేసినా ఆమె మాత్రం ట్వీట్ డిలీట్ చేయలేదు.