Asianet News TeluguAsianet News Telugu

దేవిశ్రీ ప్రసాద్ ఇంటి బయట పడుకున్న టాలీవుడ్ టాప్ డైరెక్టర్..ఆ ఫ్యామిలీతో ఉన్న రిలేషన్ ఏంటో తెలుసా ?

దేవిశ్రీ ప్రసాద్ సౌత్ మొత్తం సూపర్ క్రేజ్ తెచ్చుకున్న మ్యూజిక్ డైరెక్టర్. స్టార్ హీరోల సినిమాలకు ఎనెర్జిటిక్ ఆల్బమ్స్ ఇవ్వడంతో దేవిశ్రీ తనకి తానే సాటి. దేవిశ్రీ ప్రసాద్ కూడా ఫిల్మీ బ్యాగ్రౌండ్ ఉన్న ఫ్యామిలీ నుంచి వచ్చారు. 

SV Krishna Reddy relation with devisri prasad father dtr
Author
First Published Oct 3, 2024, 12:27 PM IST | Last Updated Oct 3, 2024, 12:27 PM IST

దేవిశ్రీ ప్రసాద్ సౌత్ మొత్తం సూపర్ క్రేజ్ తెచ్చుకున్న మ్యూజిక్ డైరెక్టర్. స్టార్ హీరోల సినిమాలకు ఎనెర్జిటిక్ ఆల్బమ్స్ ఇవ్వడంతో దేవిశ్రీ తనకి తానే సాటి. చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, పవన్ కళ్యాణ్, మహేష్, అల్లు అర్జున్, రామ్ చరణ్ ఇలా స్టార్ హీరోల చిత్రాలకు దేవిశ్రీ ప్రసాద్ సూపర్ హిట్ సాంగ్స్ ఇచ్చారు. దేవిశ్రీ ప్రసాద్ కూడా ఫిల్మీ బ్యాగ్రౌండ్ ఉన్న ఫ్యామిలీ నుంచి వచ్చారు. 

దేవిశ్రీ ప్రసాద్ తండ్రికి, ఎస్వీ కృష్ణారెడ్డికి మధ్య ఉన్న రిలేషన్ 

ఆయన తండ్రి సత్యమూర్తి టాలీవుడ్ లో పేరొందిన రచయిత. అయితే దేవిశ్రీ ప్రసాద్ కుటుంబానికి టాలీవుడ్ లో ఒక అగ్ర దర్శకుడి కుటుంబానికి చిన్న రిలేషన్ ఉందట. ఆ దర్శకుడు ఎవరో కాదు.. ఎస్వీ కృష్ణారెడ్డి.  తనకంటూ భిన్నమైన క్రేజ్ సొంతం చేసుకున్న దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి. కుటుంబ కథా చిత్రాలకు హాస్యాన్ని జోడించి ఎన్నో చిత్రాల్లో ఆయన మ్యాజిక్ చేశారు.  రచయితగా, దర్శకుడిగా, మ్యూజిక్ డైరెక్టర్ గా ఎస్వీ కృష్ణారెడ్డి రాణించారు. చివరికి అలీ, వేణు మాధవ్ లాంటి వారిని కూడా హీరోగా పెట్టి అద్భుతాలు చేశారు. కానీ స్టార్ హీరోలతో ఆయన సరైన సక్సెస్ అందుకోలేదు.

SV Krishna Reddy relation with devisri prasad father dtr

ఎస్వీ కృష్ణారెడ్డి, సత్యమూర్తి ఇద్దరూ క్లాస్ మేట్స్ అట. ఇండస్ట్రీకి వచ్చిన కొత్తల్లో సత్యమూర్తి గారి ఇంటి బయట చాప వేసుకుని పడుకునేవారట కృష్ణారెడ్డి. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా చెప్పారు. రాత్రి వాళ్ళ అరుగు మీద చాప వేసుకుని పడుకోవడం.. ఉదయాన్నే చాప మడతపెట్టి అక్కడే పెట్టేసి నా వర్క్ కి వెళ్లిపోయేవాడిని అని కృష్ణారెడ్డి అన్నారు. 

ఆయనే నా బెస్ట్ ఫ్రెండ్ : ఎస్వీ కృష్ణారెడ్డి 

సత్యమూర్తి తనకి బెస్ట్ ఫ్రెండ్ అని కృష్ణారెడ్డి అన్నారు. నేను రాసుకుని ప్రతి కథ ఆయనకి చెప్పేవాడిని అని తెలిపారు. నేను కథ చెబుతుంటే ఆయన నిజంగానే సినిమా చూస్తున్నట్లు ఫీల్ అయ్యేవారు. అంత బాగా మా ఇద్దరి మధ్య సింక్ కుదిరేది అని తెలిపారు. 

చిరంజీవి హిట్ చిత్రాలకు పనిచేసిన దేవిశ్రీ ప్రసాద్ తండ్రి 

చిరంజీవి నటించిన అభిలాష, ఛాలెంజ్, ఖైదీ నెంబర్ 786, అలాగే వెంకటేష్ చంటి లాంటి చిత్రాలకు సత్యమూర్తి డైలాగ్స్, స్క్రీన్ ప్లే అందించారు. ఇక ఎస్వీ కృష్ణారెడ్డి అయితే రచయితగా, దర్శకుడిగా రాణించారు. శుభలగ్నం లాంటి ఆల్ టైం క్లాసిక్ మూవీ తెరకెక్కించింది కూడా ఈయనే. శుభలగ్నంతో పాటు రాజేంద్రుడు గజేంద్రుడు, మాయలోడు, యమలీల, ఘటోత్కచుడు లాంటి చిత్రాలు ఆయన దర్శకత్వంలో వచ్చాయి. మ్యూజిక్ డైరెక్టర్ గా కూడా ఎస్వీ కృష్ణారెడ్డి రాణించారు. 

లేటెస్ట్ మూవీస్ పై ఎస్వీ కృష్ణారెడ్డి కామెంట్స్ 

ఎస్వీ కృష్ణారెడ్డి ఇటీవల సైలెంట్ అయ్యారు. బహుశా కొత్త దర్శకుల ప్రభావం కావచ్చు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఎస్వీ కృష్ణారెడ్డి మాట్లాడుతూ ప్రస్తుతం వస్తున్న చిత్రాలపై తన అభిప్రాయం చెప్పారు. దర్శకుడు సరికొత్త విధానాలతో సినిమాలు తెరకెక్కిస్తుండడం, అశ్లీలత లాంటి అంశాల గురించి మాట్లాడారు.డైరెక్టర్ గా నా అప్రోచ్ వేరు అని ఎస్వీ కృష్ణారెడ్డి తెలిపారు. నా చిత్రాల్లో కొన్ని రూల్స్ ఫాలో అవుతాను. ఎక్కడా బూతులు తిట్టే డైలాగులు ఉండకూడదు అనేది మొదటిది. ఆ తర్వాత డబుల్ మీనింగ్ డైలాగులు కూడా ఉండకూడదు. చివరికి హీరోయిన్ పైట సరిగ్గా లేకపోయినా, పైట చెంగు జారినా సరే ఒప్పుకోను. వెంటనే కట్ చెప్పేస్తాను. 

SV Krishna Reddy relation with devisri prasad father dtr

ఇటీవల విడుదలైన చిత్రాలపై కూడా ఎస్వీ కృష్ణారెడ్డి కామెంట్స్ చేశారు. రవితేజ మిస్టర్ బచ్చన్ చిత్రం వచ్చింది. రవితేజ పాత్ర, విలన్ పాత్ర బావుందని చెప్పారు. కానీ అది చూడదగిన సినిమా కాదని అన్నారు. దీనితో ఆ మూవీ చూడడం మానేశాను అంటూ ఎస్వీ కృష్ణారెడ్డి షాకింగ్ కామెంట్స్ చేశారు. సినిమా హిట్ అవ్వాలంటే ఒక్కటే రూల్ ఉంది.. సినిమా ప్రారంభం అయిన 7 నిమిషాల లోపు చూస్తున్న ప్రేక్షకులకు ఆసక్తి పెరగాలి. అలా చేస్తేనే ఆ చిత్రాన్ని ఇంట్రెస్ట్ గా చూస్తారు అని తెలిపారు. 

ఇటీవల ప్రభాస్ సలార్ చిత్రం వచ్చింది. అది ఆడియన్స్ ని ఎంగేజ్ చేసే చిత్రం. అందులో వెయిట్ ఎంతైనా ఉండొచ్చు. కానీ సినిమా మొత్తం ఎంగేజ్ చేస్తూ మొమెంటం మైంటైన్ చేశారు.  అందుకే సలార్ సక్సెస్ ఫుల్ చిత్రం అయింది అని అన్నారు. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios