ఒక చిన్న ఊరిలో నడిచే కథ ఇది. ఆ ఊరి స్కూల్ లో చదువుకునే అమ్మాయి కనిపించకుండా పోతుంది. ఆమెని వెతకడానికి ఇన్వెస్టిగేషన్ మొదలుపెడతారు. ఆ తరువాత మిస్సింగ్ కేస్ లో కొన్ని ఆసక్తికర విషయాలు తెలుస్తాయి. అవేవీ ట్రైలర్ లో చూపించకుండా జాగ్రత్త పడ్డారు.  

తెలుగులోనూ అనేక చిత్రాలలో నటించిన ఐశ్వర్య రాజేశ్‌ ఇప్పుడు ‘సుడల్’ అనే వెబ్ సీరిస్ తో డిజిటల్ ఎంట్రీ ఇస్తోంది. సూపర్ హిట్ ‘విక్రమ్ వేద’ దర్శకులు పుష్కర్ – గాయత్రి రూపొందించిన ఈ ఇన్వెస్టిగేటివ్ డ్రామాను అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో ఈ నెల 17న ప్రసారం చేయబోతున్నారు. ఇందులో మొదటి నాలుగు ఎపిసోడ్స్ ను బ్రహ్మ డైరెక్ట్ చేయగా, మిగిలిన నాలుగు ఎపిసోడ్స్ ను అనుచరణ్‌ చిత్రీకరించారు.

తమిళంలో తెరకెక్కిన 'సుడల్' అనే వెబ్ సిరీస్ ను అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ చేయనున్నారు. తాజాగా ఈ సిరీస్ కి సంబంధించిన ట్రైలర్ ను విడుదల చేశారు. ఇదొక ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ డ్రామా. పుష్కర్, గాయత్రి ఈ వెబ్ సిరీస్ కి స్టోరీ అందించారు. బ్రహ్మ ఈ సిరీస్ ను డైరెక్ట్ చేశారు. ఈ ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ వస్తోంది. ఈ ట్రైలర్ పై ఓ లుక్కేయండి.

 ఒక చిన్న ఊరిలో నడిచే కథ ఇది. ఆ ఊరి స్కూల్ లో చదువుకునే అమ్మాయి కనిపించకుండా పోతుంది. ఆమెని వెతకడానికి ఇన్వెస్టిగేషన్ మొదలుపెడతారు. ఆ తరువాత మిస్సింగ్ కేస్ లో కొన్ని ఆసక్తికర విషయాలు తెలుస్తాయి. అవేవీ ట్రైలర్ లో చూపించకుండా జాగ్రత్త పడ్డారు. ఓ చిన్న పల్లెటూరిలో కనిపించకుండా పోయిన తన చెల్లికోసం ప్రాణాలను పణంగా పెట్టి వెతికులాడే పాత్రను ఐశ్వర్యా రాజేశ్‌ చేసింది. ఇక పోలీస్ ఆఫీసర్స్ గా కదిల్, శ్రియా రెడ్డి నటించారు. మరో కీలక పాత్రను నటుడు, దర్శకుడు పార్తీబన్ చేశాడు. ప్రధాన భారతీయ భాషలతో పాటు 240 దేశాలలో వివిధ భాషల్లో ఈ వెబ్ సీరిస్ ను అమెజాన్ ప్రైమ్ స్ట్రీమింగ్ చేయబోతోంది. ఈ వెబ్ సీరిస్ కు సంబంధించిన తెలుగు ట్రైలర్ ను కూడా విడుదల చేశారు. మరి ఈ సిరీస్ కి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాలి!