మాజీ ప్రపంచ సుందరి సుస్మితా సేన్ గురించి తెలియని సినీ అభిమానులు ఉండరు. ఈ 43 ఏళ్ల హాట్ బ్యూటీ ఇంతవరకు వివాహం చేసుకోలేదు. కానీ పిల్లలని దత్తత తీసుకుని పెంచుతోంది. గత ఏడాది కాలంగా సుస్మిత తన ప్రేమ వ్యవహారంతో వార్తల్లో నిలుస్తోంది.
మాజీ ప్రపంచ సుందరి సుస్మిత సేన్ గత ఏడాది కాలంగా రోహ్మాన్ షాల్ అనే యువ మోడల్ తో ప్రేమలో మునిగితేలుతోంది. 43 ఏళ్ల వయసులో సుస్మిత ప్రేమలో పడడంతో ఈ వ్యవహారం బాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. ఓ ఫ్యాషన్ ఈవెంట్ సందర్భంగా సుస్మితకు, రోహ్మాన్ కు పరిచయం ఏర్పడింది.
రోహ్మాన్ వయసు ప్రస్తుతం 27 ఏళ్ళు. అంటే సుస్మిత రోహ్మాన్ కంటే దాదాపు 16 ఏళ్ళు వయసులో పెద్ద. అయినా వీరిద్దరి ప్రేమకు వయసు అడ్డు కాలేదు. ప్రస్తుతం వీరిద్దరూ సహజీవనం చేస్తున్నారు.
ప్రస్తుతం ఈ జంట మాల్దీవుల్లో వెకేషన్ ని ఎంజాయ్ చేస్తోంది. ఈ సందర్భంగా సుస్మిత, రోహ్మాన్ ఓ పడవలో విహరిస్తున్నారు. సుస్మిత బికిని ధరించి రోహ్మాన్ ఒడిలో వాలిపోయిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
రొహ్మాన్, సుస్మిత పిల్లలతో కూడా బాగా కలిసిపోయాడు. తన ప్రియుడు పిల్లలని ఆప్యాయంగా చూసుకునే దృశ్యాలని కూడా సుస్మిత తరచుగా ఇంస్టాగ్రామ్లో షేర్ చేస్తూ ఉంటుంది.
