మెగాస్టార్ చిరంజీవి బర్త్‌డేను అభిమానులు పండుగలా సెలబ్రేట్ చేస్తున్నారు. బహిరంగ వేడుకలు చేసే అవకాశం లేకపోవటంతో ఆన్‌లైన్ వేదికగా సందడి చేస్తున్నారు. వరుస అప్‌డేట్స్‌తో మెగా ఫ్యామిలీ అలరిస్తుండగా ఇతర చిత్ర యూనిట్‌లు కూడా మెగా బర్త్‌ డేను గ్రాండ్‌గా సెలబ్రేట్‌ చేస్తున్నాయి. మెగాస్టార్ పెద్ద కుమార్తె అభిమానులకు ఓ గిప్ట్‌ ఇచ్చారు. 'జీ 5' ఓటీటీ కోసం భర్త విష్ణుప్రసాద్‌తో కలిసి నిర్మిస్తున్న వెబ్ సిరీస్ 'షూట్-అవుట్ ఎట్ ఆలేరు' ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ రిలీజ్ చేశారు.

'సైరా నరసింహారెడ్డి' సహా పలు చిత్రాలకు కాస్ట్యూమ్ డిజైనర్‌గా పని చేసిన మెగాస్టార్ చిరంజీవి కూతురు సుష్మితా కొణిదెల, ఆమె భర్త విష్ణుప్రసాద్ 'గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్' నిర్మాణ సంస్థను ప్రారంభించిన సంగతి తెలిసిందే. నిర్మాతగా డిజిటల్ ఎంటర్‌టైన్‌మెంట్‌/ఓటీటీ రంగంలోకి ఎంట్రీ ఇస్తున్నారు సుస్మిత. 'జీ 5' అసోసియేష‌న్‌తో 'షూట్-అవుట్ ఎట్ ఆలేరు' వెబ్‌ సిరీస్‌ను నిర్మిస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి పుట్టిన రోజు సందర్భంగా శనివారం ఉదయం ఈ వెబ్ సిరీస్ ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ విడుదల చేశారు. రెగ్యులర్ మోషన్ పోస్టర్స్ టైపులో కాకుండా స్టోరీ టెల్లింగ్ మోషన్ పోస్టర్ విడుదల చేయడం విశేషం.

ప్రకాష్ రాజ్, శ్రీకాంత్ ప్రధాన పాత్రధారులుగా ఆనంద్ రంగా దర్శకత్వంలో ఈ వెబ్ సిరీస్ రూపొందుతోంది. వాస్తవ ఘటనల ఆధారంగా టెర్రరిజం నేపథ్యంలో 8 ఎపిసోడ్స్‌తో కూడిన ఒక క్రైమ్ డ్రామాగా తెరకెక్కిస్తున్నట్టు ప్రకటించారు. 'ఓయ్' సినిమా తరవాత ఆనంద్ రంగా దర్శకత్వం వహిస్తున్న సబ్జెక్టు ఇదే. 'జీ 5' ఓటీటీలో ఈ సిరీస్ ఎక్స్‌క్లూజివ్‌గా స్ట్రీమింగ్ కానుంది. హైదరాబాద్‌లోని ఓ పోలీస్‌ల, కొంతమంది కరుడుగట్టిన నేరస్తుడి కథల ఆధారంగా వాస్తవ ఘటనల ప్రేరణతో ఈ వెబ్ సిరీస్ రూపొందుతోందని, అదే కాన్సెప్ట్ అని యూనిట్ తెలిపింది.