ఎప్పుడూ డేటింగ్‌ కబుర్లు చెప్పే ఈ ముదురు భామ ఇన్నాళ్లకి పెళ్లి గురించి మాట్లాడింది. పెళ్లి చేసుకోవాలనే కోరిక బయటపెట్టింది సుస్మితా సేన్‌.

బాలీవుడ్‌ సీనియర్ నటి, అందాల తార సుస్మితా సేన్‌ ఎక్కువగా వార్తల్లో నిలుస్తుంది. ఆమె చాలా వరకు డేటింగ్‌, లవ్‌ విషయాల్లోనే చర్చనీయాంశంగా మారుతుంది. తరచూ కొత్త బాయ్‌ ఫ్రెండ్స్ తో ప్రేమలో పడుతూ ఆశ్చర్యపరుస్తుంది. అభిమానులకు షాక్‌ల మీద షాకులిస్తుంటుంది. ఎప్పుడూ డేటింగ్‌ కబుర్లు చెప్పే ఈ ముదురు భామ ఇన్నాళ్లకి పెళ్లి గురించి మాట్లాడింది. పెళ్లి చేసుకోవాలనే కోరిక బయటపెట్టింది సుస్మితా సేన్‌.

తనకు ఇప్పుడు పెళ్లి చేసుకోవాలనే కోరిక కలుగుతుందని, తనకు పెళ్లి అవసరం ఉందని చెప్పింది. కానీ తన పిల్లలు వద్దంటున్నారట. సుస్మితా పెళ్లి చేసుకోకపోయినా.. రౌనీ, అలీషాలను దత్తత తీసుకున్న విసయం తెలిసిందే. వాళ్లు పెద్దవాళ్లయ్యారు. అయితే ఇన్నాళ్లకి తనకు పెళ్లి చేసుకోవాలనే కోరిక కలుగుతుందట. ఆ విషయాలను సుస్మితా సేన్‌ చెబుతూ, తన పిల్లలు నాన్న లేడని ఎప్పుడూ ఫీలవ్వలేదని, ఎందుకంటే మన దగ్గర ఉన్నది కోల్పోతేనే మిస్‌ అవుతాం, లేనిదాని గురించి మిస్‌ అయిన భావనే రాదు. నేను పెళ్లి చేసుకోవాలని అనుకున్నా కూడా ఇప్పుడెందుకు పెళ్లి అసలు దేనికోసం అని ప్రశ్నిస్తున్నారట. తమకైతే నాన్న అవసరం లేదని చెబుతున్నారని, నేను కోరకుంటున్నానేమో అని కూడా ఆలోచించడం లేదని సుస్మితా సేన్‌ తెలిపింది. 

అయితే తన పిల్లలకు తండ్రి లేకపోయినా తాత ఉన్నాడని, తండ్రి లేడనే లోటు లేకుండా చూసుకుంటున్నాడని చెప్పింది. తమ నాన్నే వారికి తాతయ్యడని తెలిపింది. నాన్నే వారికి అ్నీ చూసుకుంటూ ఆడిస్తాడని, దీంతో వారికి తాతయ్యే లోకం అని తెలిపింది సుస్మితా. సుస్మితా సేన్‌ చాలా రోజుల తర్వాత యాక్టింగ్‌ చేస్తుంది. ఇటీవల ఆమె `తాలి` అనే వెబ్‌ సిరీస్‌లో నటించింది. ఇది జీయో సినిమా లో స్ట్రీమింగ్‌ అవుతుంది. దీంతోపాటు `ఆర్య 3` అనే వెబ్‌ సిరీస్‌లోనూ నటిస్తుంది. ఇది డిస్నీ ప్లస్‌ హాట్‌ స్టార్‌లో ప్రసారం కానుంది. 

ఇక మిస్‌ యూనివర్స్ 1994 విన్నర్‌గా నిలిచిన సుస్మితా సేన్‌ నటిగా అనేక బ్లాక్‌ బస్టర్‌ చిత్రాలు చేసింది. `బివి నెంబర్‌ 1`, `సర్ఫ్‌ తుమ్‌`, `ఫిల్హాల్‌`, `ఆంఖేన్‌`, `మై హూ నా`, `మైనే ప్యార్‌ క్యున్‌ కియా? వంటి చిత్రాల్లో నటించి మెప్పించింది. 2010 వరకు సినిమాలు చేసింది. ఆ తర్వాత గుడ్‌ బై చెప్పింది. కానీ ప్రేమలో మునిగి తేలుతూనే ఉంది. చాలా మంది హీరోలతో ఆమె రిలేషన్‌షిప్‌ని మెయింటేన్‌ చేసింది.

 ప్రధానంగా రణ్‌దీప్‌ హుడాతో, ఆ తర్వత మోడల్‌ రోహ్మన్‌ షాల్‌, ఇటీవల ఐపీఎల్‌ సృష్టికర్త లలిత్‌ మోడీలతో డేటింగ్‌ చేసింది. ప్రస్తుతం సింగిల్‌గానే ఉంది. దీంతో ఇప్పుడు పెళ్లి చేసుకోవాలనే కోరిక కలుగుతుందట. ఇక పిల్లలు లేరనే భావన లేకుండా ఆమె ఇద్దరు అమ్మాయిలను దత్తత తీసుకుంది. 2000లో రెనీని, 2010లో అలీషాలను దత్తత తీసుకుంది సుస్మితా సేన్‌.