మాజీ విశ్వసుందరి, బాలీవుడ్ నటి సుస్మితా సేన్ పెళ్లి చేసుకోబోతుందా..? అంటే అవుననే సమాధానాలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. గత కొంత కాలంగా ఆమె మోడల్ రోహ్మన్ షాల్ తో డేటింగ్ చేస్తోంది.

బాలీవుడ్ లో జరిగే కొన్ని ఈవెంట్స్ కి, ప్రోగ్రామ్ లకు ఇద్దరూ కలిసి వెళ్లడం, కలిసి పార్టీలు చేసుకోవడం వంటి విషయాలతో వీరి రిలేషన్ షిప్ బయటపడింది. ఓ ఫ్యాషన్ షోలో సుస్మిత, రోహ్మన్ కలిసి ర్యాంప్ వాక్ చేశారు. అప్పటినుండి వీరిమధ్య స్నేహం కుదిరింది.

ఆ తరువాత ప్రేమగా మారి ఇప్పుడు పెళ్లి వరకు వెళ్తుందని సమాచారం. రోహ్మన్ తో ప్రేమలో ఉన్నట్లు సుస్మిత ఇన్స్టాగ్రామ్ వేదికగా వెల్లడించింది. కొన్ని వారాల క్రితమే రోహ్మన్ పెళ్లి చేసుకుందామనే ప్రపోజల్ సుస్మిత ముందు పెట్టగా దానికి ఆమె కూడా అంగీకరించినట్లు తెలుస్తోంది.వచ్చే ఏడాదిలో వీరి పెళ్లి జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.

సుస్మితకి ఇప్పటివరకు పెళ్లి కాకపోయినా.. ఇద్దరు ఆడపిల్లలను దత్తత తీసుకొని పెంచుతుంది. దీపావళి నాడు తన ఇద్దరు పిల్లలు కాబోయే భర్తతో కలిసి సుస్మిత దిగిన ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది!