మాజీ విశ్వసుందరి, బాలీవుడ్ భామ సుస్మితా సేన్ తరచుగా వార్తల్లో నిలుస్తోంది. 46 ఏళ్ళు వచ్చినా ఆమె వివాహం చేసుకోలేదు. ఇద్దరు పిల్లల్ని దత్తత తీసుకుని జీవితం సాగిస్తున్నారు.
మాజీ విశ్వసుందరి, బాలీవుడ్ భామ సుస్మితా సేన్ తరచుగా వార్తల్లో నిలుస్తోంది. 46 ఏళ్ళు వచ్చినా ఆమె వివాహం చేసుకోలేదు. ఇద్దరు పిల్లల్ని దత్తత తీసుకుని జీవితం సాగిస్తున్నారు. గత కొంత కాలంగా సుస్మితా సేన్ తనకన్నా వయసులో చాలా చిన్నవాడైన రొహ్మన్ షాల్ అనే యువకుడితో సహజీవనం చేస్తోంది. కొన్నిరోజుల క్రితమే డిసెంబర్ 3న తామిద్దరం విడిపోతున్నట్లు ప్రకటించారు.
దీనితో వీరిద్దరి డేటింగ్ రిలేషన్ షిప్ కి బ్రేక్ పడింది. సహజీవనం చేస్తున్న టైంలో సుస్మితా సేన్, రొహ్మన్ ఇద్దరూ చెట్టాపట్టాలేసుకుని విదేశాల్లో విహరించారు. వెకేషన్స్ లో ఎంజాయ్ చేశారు. కానీ మనస్పర్థల వల్ల ఇద్దరూ విడిపోయారు. కుర్రవాళ్ళతో రిలేషన్ షిప్ బాలీవుడ్ లో కొత్తేమి కాదు.
క్రేజీ హీరో అర్జున్ కపూర్ తో మలైకా అరోరా రిలేషన్ షిప్ లో ఉన్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగా తాజాగా సుస్మితా సేన్ ఇంస్టాగ్రామ్ లైవ్ లో అభిమానులతో ముచ్చటించింది. ఇంస్టాగ్రామ్ చాట్ లో భాగంగా అభిమానులు ఆమెకి అనేక ప్రశ్నలు సంధించారు.
మీ దృష్టిలో ప్రేమ అంటే ఏమిటి అని ప్రశ్నించగా సుస్మితా సేన్ ఇచ్చిన సమాధానం వైరల్ గా మారింది. లైఫ్ లో నాకు గౌరవమే చాలా ముఖ్యం. గౌరవం లేని చోట ప్రేమకు అర్థం లేదు. ప్రేమ వస్తుంది పోతుంది.. కానీ గౌరవం మాత్రం ఉండాలి. అలా ఉన్నప్పుడే ప్రేమకి కూడా సెకండ్ ఛాన్స్ ఉంటుంది అని సుస్మితా ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.
ఆమె వ్యాఖ్యలు పరోక్షంగా రొహ్మన్ ని ఉద్దేశించినవే అని నెటిజన్లు అంటున్నారు. అంటే సుస్మితా గౌరవానికి భంగం కలిగించేలా రొహ్మన్ ప్రవర్తించాడా అనే చర్చ జరుగుతోంది. 1994లో సుస్మితా సేన్ మిస్ యూనివర్స్ గా విజయం సాధించింది. ఆ తర్వాత ఆమె అనేక బాలీవుడ్ చిత్రాల్లో నటించింది. ప్రస్తుతం సుస్మిత హాట్ స్టార్ లో వెబ్ సిరీస్ లు చేస్తోంది.
