మాజీ విశ్వసుందరి, బాలీవుడ్ నటి సుష్మితా సేన్ గత కొంత కాలంగా మోడల్ రోమన్ షాల్ తో డేటింగ్ చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. వీరిద్దరూ కలిసి కపుల్ వర్కవుట్లు చేయడం, ఈవెంట్లకు కలిసి హాజరవ్వడంతో వీరి మధ్య ప్రేమాయణం ఏ రేంజ్ లో ఉందో అంటూ బాలీవుడ్ లో రకరకాలుగా చెప్పుకుంటున్నారు.

ఈ జంట ఎప్పుడు పెళ్లి చేసుకుంటుందని..? మీడియా కథనాలు ప్రచురిస్తోంది. సోషల్ మీడియాలో కూడా వీరి పెళ్లి గురించి నెటిజన్లు ప్రశ్నిస్తూనే ఉన్నారు. దీంతో సుష్మిత సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టింది.

''ఈ పెళ్లిళ్ళను ఎవరు కనిపెట్టారో.. నేను నిన్నెంతగా ప్రేమిస్తున్నానంటే.. నువ్వు ఎప్పుడూ నన్ను వదిలి వెళ్లకుండా ప్రభుత్వం చర్యలు తీసుకునేలా చూస్తాను'' అంటూ తన ప్రేమికుడిపై ప్రేమను  పరోక్షంగా వెల్లడించింది. అయితే ఈ పోస్ట్ చూసిన నెటిజన్లు మాత్రం సుష్మితాపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

పెళ్లి గురించి సుష్మితా జనాల్లో తప్పుడు అభిప్రాయాలను కలిగించేలా మాట్లాడుతుందని ఆమెని తిట్టిపోస్తున్నారు. పెళ్లి చేసుకోవాలా లేదా అనేది వ్యక్తిగత అభిప్రాయమని దానికి ప్రభుత్వాన్ని ప్రస్తావించాల్సిన అవసరం ఏంటని ఆమెను ప్రశ్నిస్తున్నారు. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

😅👊 #marriage #strategy #cushandwizdom 😎❤️

A post shared by Sushmita Sen (@sushmitasen47) on Jan 29, 2019 at 8:30am PST