మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వరుసగా యువ దర్శకులకు అవకాశాలు ఇస్తున్నారు. అయితే భోళా శంకర్ తర్వాత చిరంజీవి నటించబోయే చిత్రానికి అధికారిక ప్రకటన రాలేదు. కానీ తన పెద్ద కుమార్తె సుష్మిత కొణిదెల నిర్మాణంలో చిరు ఒక చిత్రం చేయబోతున్న సంగతి తెలిసిందే.
మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వరుసగా యువ దర్శకులకు అవకాశాలు ఇస్తున్నారు. అయితే భోళా శంకర్ తర్వాత చిరంజీవి నటించబోయే చిత్రానికి అధికారిక ప్రకటన రాలేదు. కానీ తన పెద్ద కుమార్తె సుష్మిత కొణిదెల నిర్మాణంలో చిరు ఒక చిత్రం చేయబోతున్న సంగతి తెలిసిందే. వాల్తేరు వీరయ్య బ్లాక్ బస్టర్ తర్వాత చిరంజీవి సినిమాలపై అంచనాలు పెరిగిపోతున్నాయి.
సుష్మిత కూడా తన తండ్రితో నిర్మించే చిత్రం కోసం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. ఈ చిత్రాన్ని బంగార్రాజు ఫేమ్ కళ్యాణ్ కృష్ణ డైరెక్ట్ చేయబోతున్నాడు. ఈ మేరకు ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. సుస్మిత కొణిదెల గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్ అనే సొంత బ్యానర్ స్థాపించిన సంగతి తెలిసిందే. ఇందులోనే తన తండ్రి చిత్రాన్ని ఆమె నిర్మించబోతున్నారు.
అయితే సుస్మిత కొందరు బడా నిర్మాతల నుంచి కళ్ళు చెదిరే ఆఫర్ వచ్చిందట. చిరంజీవి చిత్రానికి తాము కూడా నిర్మాణ భాగస్వామిగా ఉంటాం అని అడిగారట. బడ్జెట్ మొత్తం తామే భరిస్తామని.. కేవలం లాభాల్లో మాత్రం వాటా ఇస్తే చాలని అడిగారట. ఇంత అద్భుతమైన ఆఫర్ ఇచ్చినప్పటికి మెగా డాటర్ వారికి ఊహించని షాక్ ఇచ్చింది. తన తండ్రితో తాను నిర్మిస్తున్న తొలి చిత్రం కాబట్టి మొత్తం కష్టనష్టాలు అన్ని తానే భరించాలని అనుకుంటున్నట్లు.. ఇంకొకరి ప్రమేయం ఉండొద్దని భావిస్తున్నట్లు సుష్మిత తేల్చేసింది. చివరకి చిరంజీవి చెప్పి చూసినా ఆమె వినలేదు. సోలోగానే చిరు, కళ్యాణ్ కృష్ణ చిత్రాన్ని నిర్మించేందుకు సుష్మిత సిద్ధం అవుతున్నారు.
ఇదిలా ఉండగా చిరంజీవి నటిస్తున్న భోళా శంకర్ చిత్రం ఆగష్టు 11న గ్రాండ్ రిలీజ్ కి రెడీ అవుతోంది. ఈ మూవీ రిలీజ్ అయ్యాక చిరంజీవి తదుపరి చిత్రం గురించి ప్రకటన రానుంది.
