ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో చాలా మంది హీరోలు ఇతర హీరో చిత్రాల్లో కనిపించడానికి ఆసక్తి చూపుతున్నారు. కథ, పాత్ర బాగుంటే వేరే హీరోలతో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోవడానికి ఓకే చెబుతున్నారు. హీరో సుశాంత్ కూడా తాజాగా ఓ స్టార్ హీరో సినిమాలో కనిపించడానికి సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.

చాలా కాలంగా హిట్స్ లేక బాధపడుతున్న సుశాంత్ కి 'చిలసౌ' సినిమా మంచి సక్సెస్ ఇచ్చింది. అయితే ఈ సినిమా తరువాత సుశాంత్ మరో సినిమా అంగీకరించలేదు. తాజాగా త్రివిక్రమ్-అల్లు ఆర్జున్ కాంబినేషన్ లో వస్తోన్న సినిమాలో నటించడానికి సుశాంత్ అంగీకరించినట్లు తెలుస్తోంది.

ఈ సినిమాలో అతడి పాత్ర చిన్నదే అయినా.. ఆకట్టుకునే విధంగా ఉంటుందని సమాచారం. అమాయకపు  అబ్బాయి పాత్రలో సుశాంత్ కనిపిస్తాడట. సుశాంత్ పాటు ఈ సినిమాలో మరో నటుడు నవదీప్ ని కూడా తీసుకున్నట్లు తెలుస్తోంది.

అయితే నవదీప్ పాత్ర ఎలా ఉండబోతుందనే విషయంలో క్లారిటీ లేదు. హారికా హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై తెరకెక్కుతోన్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మరో పది రోజుల్లో మొదలుకానుంది. ఈ సినిమాలో హీరో తల్లిగా టబు కనిపించనుందని టాక్.