సుశాంత్ సింగ్ రాజ్ పుత్ జయంతి నేడు. ఆయన మరణం తరువాత ఇది మొదటి జయంతి కాగా కుటుంబ సభ్యులు మరియు అభిమానులు స్మరించుకుంటున్నారు. ఈ సంధర్భంగా సుశాంత్ సిస్టర్ శ్వేతా సింగ్ కీర్తి సోషల్ మీడియా వేదికగా స్పందించారు. సుశాంత్ సింగ్ అరుదైన ఫోటోలు పంచుకోవడంతో పాటు, భావోద్వేగ కామెంట్ చేశారు. 'లవ్ యూ భాయ్... నువ్వు నాలో సగం... ఎప్పటికీ అలాగే ఉంటావు...' అంటూ ఆమె ఎమోషనల్ అయ్యారు. 


ఇక నేడు ఆయన ఫ్యాన్స్ సుశాంత్ డే అంటూ సోషల్ మీడియాలో ట్యాగ్ ట్రెండ్ చేస్తున్నారు. 2020జూన్ 14న సుశాంత్ సింగ్ బాంద్రాలోని తన నివాసంలో ఉరికి వేలాడుతూ కనిపించారు. సుశాంత్ డెత్ ని ఆత్మహత్యగా నమోదు చేసుకున్న పోలీసులు పోస్టుమార్టం నిర్వహించారు. ఆ తరువాత ఈ కేసు అనేక మలుపులు తిరిగింది. సుశాంత్ మరణానికి రియా చక్రవర్తి కారణం అంటూ సుశాంత్ తండ్రి కేసుపెట్టారు. 
అనేక మలుపు తీసుకున్న ఈ కేసులో రియా అరెస్ట్ కావడం జరిగింది. 

ఇక సోషల్ మీడియా వేదికగా సుశాంత్ ఫ్యాన్స్ బాలీవుడ్ బడాబాబులపై వ్యతిరేకత వ్యక్తం చేశారు.  సుశాంత్ మరణానికి పరోక్షంగా కారణం అయ్యారంటూ కరణ్ జోహార్, అలియా భట్, మహేష్ భట్, కరీనా కపూర్, సల్మాన్ వంటి వారిని టార్గెట్ చేశారు. సదరు సెలెబ్రిటీలు కొన్నాళ్లు సోషల్ మీడియాకు దూరం అయ్యారంటే పరిస్థితి ఏమిటో అర్థం చేసుకోవచ్చు. మహేష్ భట్ దర్శకత్వంలో అలియా హీరోయిన్ గా తెరకెక్కిన సడక్ 2 మూవీకి సుశాంత్ ఫ్యాన్స్ డిజ్ లైక్స్ ఇవ్వడం ద్వారా వరస్ట్ రేటింగ్ వచ్చేలా చేశారు.