గత ఏడాది చిలాసౌ సినిమాతో సింపుల్ గా సక్సెస్ అందుకున్న యువ హీరో సుశాంత్ నెక్స్ట్ సినిమాను ఇంకా మొదలుపెట్టలేదు. అవకాశాలు బాగానే వస్తున్నప్పటికీ తొందరపడకుండా తనకు సెట్టయ్యే కథల కోసం వెయిట్ చేస్తున్నాడు. అందులో భాగంగా ఇప్పుడు అల్లు అర్జున్ సినిమాలో నటించడానికి రెడీ అవుతున్నాడు. 

త్రివిక్రమ్ దర్శకత్వంలో అల్లు అర్జున్ ఒక సినిమా చేస్తోన్న సంగతి తెలిసిందే. అయితే ఈ కథలో మలుపు తిప్పే పాత్రకు సుశాంత్ కరెక్ట్ గా సెట్టవుతాడని దర్శకుడు ఏరికోరి సెలెక్ట్ చేసుకున్నాడు. గతంలోనే ఈ విషయంపై రూమర్స్ వచ్చినప్పటికీ చిత్ర యూనిట్ క్లారిటీ ఇవ్వలేదు. ఇక ఇప్పుడు ఫైనల్ గా సుశాంత్ తన నెక్స్ట్ ప్రాజెక్ట్ పై క్లారిటీ ఇచ్చాడు. 

గీతా ఆర్ట్స్ - హారికా హాసిని ప్రొడక్షన్స్ లో రూపొందుతున్న అల్లు అర్జున్ కొత్త సినిమాలో నటించబోతున్నట్లు సుశాంత్ తెలిపాడు. తనకు ఇష్టమైన డైరెక్టర్ త్రివిక్రమ్ అంటూ.. ఇప్పుడు ఆయన దర్శకత్వంలో నటించడం అనేది చాలా ఆనందాన్ని కలిగిస్తోందని సుశాంత్ వివరణ ఇచ్చాడు.