సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణం ఆయన ఫ్యాన్స్ ని ఎంతగా కలచి వేసిందో చెప్పడానికి, బాలీవుడ్ లో ఏర్పడిన అశాంతే నిదర్శనం. సుశాంత్  ఆత్మహత్య చేసుకున్నారా? లేక ఎవరైనా చంపేశారా? అనే విషయాన్ని పక్కడ పెడితే...కొందరు ఆయనను మానసికంగా వేదనకు గురిచేశారు అనేది నిజం. తమ మాటల ద్వారా, చేతల ద్వారా సుశాంత్ కి హాని చేసే ప్రయత్నం చేశారు. అందుకే బాలీవుడ్ పెద్దలపై సోషల్ మీడియా వేదికగా తీవ్ర వ్యతిరేకత వెల్లువెత్తింది. కరణ్ జోహార్, అలియా భట్, మహేష్ భట్, సల్మాన్ ఖాన్, కరీనా కపూర్ వంటి వారిపై నెటిజెన్స్ సోషల్ మీడియాలో దాడికి దిగడం జరిగింది. 

కొంత కాలంగా సదరు సెలెబ్రిటీలు సోషల్ మీడియాలో సందడి చేయడం లేదు. కరణ్ జోహార్, కరీనా కపూర్ వంటి వారు సోసిల్ మీడియాకు దూరంగా ఉంటున్నారు. నటి సోనాక్షి సిన్హా నెపోటిజం వ్యాఖ్యలకు విసిగిపోయి తన ట్విట్టర్ ని త్యాగం చేసింది. సుశాంత్ ఫ్యాన్స్ మెయిన్ టార్గెట్ లో దర్శకుడు మహేష్ భట్ మరియు అతని కుమార్తె అలియా భట్ ఉన్నారు. వీరిపై పంజా విసరడానికి సిద్ధంగా ఉన్న వీరు, తమ ప్రతాపం సడక్ 2 ట్రైలర్ పై చూపిస్తున్నారు. దర్శకుడు మహేష్ భట్ తెరకెక్కించిన సడక్ 2 ట్రైలర్ నేడు విడుదల కాగా సుశాంత్ ఫ్యాన్స్ యూట్యూబ్ లో డిజ్ లైక్స్ తో విరుచుకుపడ్డారు. 

కొద్ది గంటల ముందు విడుదలైన సడక్ 2 ట్రైలర్  లైక్స్ కి, పదిరెట్లు డిజ్ లైక్స్ నమోదు కావడం విశేషం. ఇక కామెంట్ సెక్షన్ లో కూడా తమ అసహనం, కోపం తెలియజేస్తున్నారు. డిజ్ లైక్స్ లో వరల్డ్ రికార్డు సడక్ 2 ట్రైలర్ పేరిట నమోదు చేయాలని కోరుకుంటున్నారు. ట్రైలర్ చూడకుండా, కేవలం డిజ్ లైక్ చేయాలని వారు కామెంట్ చేయడం విశేషం. డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ఈ మూవీ ఓ టి టి హక్కులు దక్కించుకోగా, అక్కడ కూడా ఈ ప్రభావం ఉంటుందని అనిపిస్తుంది. సడక్ 2 మూవీలో సంజయ్ దత్, ఆదిత్య రాయ్ కపూర్ మరియు అలియా భట్ ప్రధాన పాత్రలలో నటించారు.