సుశాంత్‌కు మృతితో షాక్‌లో స్కూల్‌ యాజమాన్యం. చిన్ననాటి మధురస్మృతులను గుర్తు చేసుకుంటూ సోషల్ మీడియా పోస్ట్‌. యంగ్ హీరో మృతిలో పాట్నాలో విషాద వాతావరణం.

బాలీవుడ్ యంగ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మృతితో సినీ అభిమానులు షాక్‌లో ఉన్నారు. ఆయన పుట్టి పెరిగిన పాట్నాలో విషాద వాతావరణం నెలకొంది. ముఖ్యంగా సుశాంత్ చదువుకున్న సెయింట్ కరెన్స్‌ సెకండరీ స్కూల్‌కు చెందిన స్టూడెంట్స్, టీచర్స్‌, కమిటీ మెంబర్స్‌ సుశాంత్ మృతితో షాక్ అయ్యారు. ఆదివారం సుశాంత్ మరణవార్త తెలిసిన వెంటనే స్కూల్ అధికారిక ఫేస్‌బుక్ పేజ్‌లో సుశాంత్ కు చెందిన కొన్ని ఫోటోలను షేర్ చేశారు.

ఆ ఫోటోల్లో స్కూల్ డేస్‌లో యూనిఫాంలో ఇతర విద్యార్దులతో కలిసి పోజ్ ఇచ్చాడు సుశాంత్. ఈ ఫోటోలతో పాటు సుశాంత్ నటించిన సూపర్ హిట్ సినిమా ధోనిలోని స్టిల్స్‌ను కూడా షేర్ చేశారు స్కూల్‌ యాజమాన్యం. ఫోటోలతో పాట A Finish We Never Expected Rest In peace Sushant Singh Rajput (ఇలాంటి ముంగిపు మేం ఎప్పుడూ ఊహించలేదు. నీ ఆత్మకు శాంతికలగాలి సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌)` అంటూ కామెంట్ చేశారు.

ధోని, చిచోరే, కేధార్‌నాథ్ లాంటి ఎన్నో సినిమాల్లో నటించిన సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌ ఆదివారం ఉదయం తన ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలసింది. అయితే ఆయన ఆత్మహత్యకు కారణాలు మాత్రం తెలియరాలేదు. సన్నిహితులు సుశాంత్ కొంతకాలంగా డిప్రెషన్‌తో బాధపుడుతున్నాడని అందుకోసం ట్రీట్‌మెంట్‌ కూడా తీసుకుంటున్నాడని తెలిపారు.