బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆకస్మిక మరణం అందరినీ కలచివేసింది. ఆయన ఆత్మహత్య తో బాలీవుడ్ నటులంతా ఒక్కసారిగా షాకయ్యారు. దీంతో.. సోషల్ మీడియాలో ఆయన మృతి పట్ల సంతాపం తెలియజేశారు. కాగా.. సుశాంత్ మృతి పట్ల ఆయన గర్ల్ ఫ్రెండ్ కృతి సనన్ స్పందించకపోవడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమౌతున్నాయి.

సుశాంత్, కృతి సనన్ లు రాబ్తా సినిమాలో కలిసి నటించారు. ఆ సినిమా సమయంలో వారి మధ్య స్నేహం ఏర్పడగా.. కొంత కాలం వారు డేటింగ్ చేశారంటూ ప్రచారం జరిగింది. వారి మధ్య ఉన్న బంధాన్ని వారు ఎప్పుడూ ధ్రువీకరించకపోయినా.. వాళ్లిద్దరూ ప్రేమలో ఉన్నారంటూ వార్తలు వచ్చాయి.

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

नग़मे हैं ,शिकवे हैं ,किस्से हैं ,बातें हैं ...💔

A post shared by Nupur Sanon (@nupursanon) on Jun 14, 2020 at 10:42pm PDT

 

తాజాగా.. సుశాంత్ మరణంతో.. కృతి సోషల్ మీడియాలో ఏం పోస్టు పెడుతుందా అని అందరూ ఎదురుచూశారు. అయితే.. కృతి ఎలాంటి పోస్టు పెట్టకపోవడంతో నెటిజన్లు మండిపడ్డారు. ఈ నేపథ్యంలో ఆమెను ట్రోల్ చేయడం మొదలుపెట్టారు.

నీకసలు హృదయమే లేదా.. కనీసం ఒక్క పోస్టు కూడా పెట్టలేవా అంటూ కృతిని టార్గెట్ చేశారు. అంత మంది ట్రోల్ చేస్తున్నా.. కృతి కనీసం స్పందించ లేదు. దీంతో.. రంగంలోని కృతి సోదరి నూపూర్ సనన్ రంగంలోకి దిగింది.

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Nupur Sanon (@nupursanon) on Jun 14, 2020 at 11:38pm PDT

ఇన్ స్టాగ్రామ్ లో గతంలో తాను సుశాంత్ కలిసి దిగిన ఓ ఫోటోని షేర్ చేసి నివాళులర్పించింది. అనంతరం తన సోదరిని ట్రోల్స్ చేస్తున్న వారిపై మండిపడింది.

తాను, తన సోదరి సుశాంత్ మరణం పట్ల ఎంతగానో కుంగిపోయామని చెప్పింది. అంత మాత్రాన.. సోషల్ మీడియాలో పోస్టు పెట్టాల్సిన పనిలేదు కదా అని ప్రశ్నించింది. సుశాంత్ చనిపోయాడని తెలిసిన దగ్గర నుంచి అందరూ మెంటల్ హెల్త్ గురించి పోస్టులు పెడుతున్నారని.. వాళ్లే..తిరిగి తమ మెంటల్ హెల్త్ పొగొట్టేలా మెసేజ్ లతో ట్రోల్ చేస్తున్నారని ఆమె మండిపడింది.