Asianet News TeluguAsianet News Telugu

సుశాంత్ ది ఆత్మహత్యే..పోస్టుమార్టం రిపోర్టు వెల్లడి

అత‌ని ఇంట్లో ముంబై పోలీసులు యాంటీ డిప్రెష‌న్ మందుల‌ను స్వాధీనం చేసుకున్నారు. కానీ ఎలాంటి సూసైడ్ నోట్ క‌నిపించ‌లేదు. మ‌రోవైపు ఆయ‌న మ‌ర‌ణంపై చిత్ర ప‌రిశ్ర‌మ తీవ్ర దిగ్భ్రాంతి వ్య‌క్తం చేసింది.
 

Sushant Singh Rajput died due to hanging, postmortem report reveals
Author
Hyderabad, First Published Jun 15, 2020, 11:27 AM IST

బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ముంబయిలోని బాంద్రా అపార్ట్ మెంట్ లో ఆత్మహత్యకు పాల్పడిన సంగతి తెలిసిందే. కాగా ఆయన మృతదేహానికి పోస్టుమార్టం పూర్తయ్యింది.  ఆ పోస్టుమార్టం నివేదికను వైద్యులు విడుదల చేశారు.

ఆ రిపోర్టు ప్రకారం సుశాంత్ ది ఆత్మహత్య అని తేలింది. అయితే అవ‌య‌వాల్లో విష‌పూరితాలు ఉన్నాయో లేదో ప‌రీక్షించేందుకు న‌టుడి అవ‌యవాల‌ను జేజే ఆసుప‌త్రికి త‌ర‌లించారు. కాగా 34 ఏళ్ల‌ వ‌య‌సులోనే సుశాంత్ త‌న నివాసంలో ఆదివారం ఉరి వేసుకున్న విష‌యం తెలిసిందే. 

అత‌ని ఇంట్లో ముంబై పోలీసులు యాంటీ డిప్రెష‌న్ మందుల‌ను స్వాధీనం చేసుకున్నారు. కానీ ఎలాంటి సూసైడ్ నోట్ క‌నిపించ‌లేదు. మ‌రోవైపు ఆయ‌న మ‌ర‌ణంపై చిత్ర ప‌రిశ్ర‌మ తీవ్ర దిగ్భ్రాంతి వ్య‌క్తం చేసింది.

నేడు న‌టుడి అంత్య‌క్రియ‌లు జ‌ర‌గగ‌నుండ‌గా.. సుశాంత్ కుటుంబీకులు వారి స్వ‌స్థ‌ల‌మైన పాట్నా నుంచి ముంబైకు ప‌య‌న‌మ‌య్యారు. ఇదిలా వుండ‌గా రెండేళ్లు థియేట‌ర్ ఆర్టిస్ట్‌గా కొన‌సాగిన సుశాంత్ "కిసీ దేశ్ మే హై మేరా దిల్" సీరియ‌ల్‌తో బుల్లితెర‌పై తెరంగ్రేటం చేశాడు. అనంత‌రం "కాయ్ పో చె" (2013) చిత్రం ద్వారా బాలీవుడ్‌కు ప‌రిచ‌యమ‌య్యాడు.

 అలా ‘శుద్ధ్‌ దేశీ రొమాన్స్‌’, ‘పీకే’, ‘డిటెక్టివ్‌ బ్యోమకేష్‌ బక్షి" చిత్రాలు న‌టుడిగా అత‌డికి మంచి పేరు తెచ్చిపెట్టాయి. క్రికెట‌ర్ మ‌హేంద్ర సింగ్ ధోనీ జీవితం ఆధారంగా చేసిన ‘ఎం.ఎస్‌. ధోనీ’తో దేశ‌వ్యాప్తంగా పాపులారిటీ సంపాదించుకున్నాడు. ఆయ‌న‌ చివ‌రిసారిగా "చిచోర్" చిత్రంలో క‌నిపించాడు.

Follow Us:
Download App:
  • android
  • ios