బాలీవుడ్‌ నటుడు సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ కేసులో మరో ట్విస్ట్ బయటపడింది. మనీలాండరింగ్‌ కేసుకు సంబంధించి షాకింగ్‌ విషయాలు వెల్లడయ్యాయి. సుశాంత్‌ కేసులోకి హీరోయిన్‌ అంకిత లోఖండే వచ్చి చేరింది. సుశాంత్‌ మాజీ ప్రియురాలు అయిన అంకిత కోసం మలాడ్‌లో రూ.4.5కోట్లు విలువ చేసే ఫ్లాట్‌ సుశాంత్‌ కొనుగోలు చేసినట్టు తెలుస్తుంది. ప్రస్తుతం అంకిత అదే ఫ్లాట్‌లో ఉంటుందని తేలింది. ఈడీ విచారణలో ఇలా ఒక్కొక్కటిగా విస్తూ పోయే నిజాలు బయటపడుతున్నాయి. 

సుశాంత్‌ మనీ విషయంలో అవకతవకలు జరిగాయని, రూ. 15కోట్లు రియా సుశాంత్‌ అకౌంట్‌ నుంచి అజ్ఞాత వ్యక్తికి తరలించిందని సుశాంత్‌ తండ్రి కే కే సింగ్‌ పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. దీనిపై దర్యాప్తు ముమ్మరం చేసిన పోలీసులు, ఈడీని రంగంలోకి దించారు. దీనిపై ఇప్పటికే సుశాంత్‌ మాజీ ప్రియురాలు రియా కుటుంబ సభ్యులను, సుశాంత్‌ తండ్రిని, సుశాంత్‌ సోదరి స్వేతా సింగ్‌ని ఈడీ అధికారులు విచారించారు. అలాగే సీఏలను ప్రశ్నించింది ఈడీ. ఈ క్రమంలో పలు కీలక సమాచారాన్ని ఈడీ రాబట్టింది. 

తాజాగా సుశాంత్‌ కేసులో మరో కోణం బయటపడింది. తన మాజీ ప్రియురాలు కోసం సుశాంత్‌ రూ.4.5కోట్ల విలువైన ఫ్లాట్‌ని కొనిచ్చాడని వెల్లడైంది. అందుకోసం ప్రతి నెల వాయిదాలు చెల్లించాడని తెలుస్తుంది. ఇద్దరు ప్రియురాళ్ళు సుశాంత్‌ని దారుణంగా వాడుకున్నారనే విషయం బయటపడింది. సుశాంత్‌ అమాయకత్వాన్ని వాడుకుని మోసం చేస్తున్నారని సుశాంత్‌ కుటుంబం ఆరోపిస్తుంది. 

మరి ఈ కేసులో ఇంకెన్ని కొత్త విషయాలు బయటపడతాయో చూడాలి. ఇక సుశాంత్‌ జూన్‌ 14న బాంద్రాలోని తన అపార్ట్ మెంట్‌లో ఆత్మహత్యకు పాల్పడ్డ విషయం తెలిసిందే. పోలీసులు దీన్ని ఆత్మహత్యగా చెబుతున్నా, హత్య జరిగిందనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. దీనిపై ముంబయి, బీహార్‌ పోలీసులు విచారణ జరుపుతుండగా, సుశాంత్‌ తండ్రి కోరిక మేరకు కేసుని సీబీఐకి అప్పగించారు. సీబీఐ రంగంలోకి దిగాల్సి ఉంది.